Site icon HashtagU Telugu

M. S. Swaminathan: స్వామినాథన్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలి: మంత్రి నిరంజన్ రెడ్డి

Swaminathan.. The Country Owes You

Swaminathan.. The Country Owes You

M. S. Swaminathan: చెన్నైలోని తారామణిలో భారత హరితవిప్లవ పితామహుడు, సుప్రసిద్ద వ్యవసాయ శాస్త్రవేత్త  డాక్టర్ స్వామినాథన్ భౌతిక ఖాయానికి  రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సీడ్సీ ఎండీ కేశవులు నివాళులు అర్పించారు. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడారు. స్వామినాథన్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారతరత్న ఇవ్వడం ద్వారా శాస్త్రవేత్తలను, ఈ దేశ రైతాంగాన్ని, వ్యవసాయరంగాన్ని గౌరవించినట్లు అవుతుందన్నారు.

‘‘స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఆకలితో అలమటించి లక్షలాదిమంది చనిపోయిన పరిస్థితిని చూసి చలించి వైద్య విద్యను వదిలేసి వ్యవసాయ విద్యను ఎంచుకుని పరిశోధకుడిగా మారి ప్రపంచ ప్రఖ్యాతిగాంచారు.  పరిశోధకుడిగా తిండిగింజలను అందించి ఆకలిని రూపుమాపేందుకు కంకణం కట్టుకున్న శాస్త్రీయ యోధుడు మానవాళి జీవిస్తున్న ఈ వందేళ్లకాలంలో  ప్రపంచాన్ని ప్రభావితం చేసిన అతి కొద్దిమందిలోని అద్భుతమయిన శాస్త్రవేత్త’’ అని నిరంజన్ రెడ్డి స్వామినాథన్ సేవలను కొనియాడారు.