BRS Minister: అమెరికాలో కొనసాగుతున్న మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటన

తెలంగాణ  వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లోని IFPRI ప్రధాన కార్యాలయంలో సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.

  • Written By:
  • Updated On - September 2, 2023 / 05:12 PM IST

అమెరికా పర్యటనలో భాగంగా మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సందర్శించారు . ఆ తర్వాత విశ్వవిద్యాలయం డీన్ మరియు డైరెక్టర్ క్రెయిగ్ బేరౌటీతో భేటీ అయ్యారు. కీలక విషయాలపై గురించి చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఇస్టా అధ్యక్షులు, తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ ఎండీ కేశవులు, మేరీల్యాండ్ స్టేట్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్ ఆఫ్ రీసెర్చ్, పునీత్ శ్రీవాస్తవ,  డైరెక్టర్, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ జిమ్మీ స్మిత్ ఇంకా యూనివర్సిటీకి చెందిన ఇతర శాస్త్రవేత్తలు తదితరులు ఉన్నారు.

అనంతరం తెలంగాణ రాష్ట్రం, అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ  (ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్  – IFPRI) మధ్య వ్యవసాయ సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అమెరికాలోని వాషింగ్టన్ డీసీ లోని IFPRI ప్రధాన కార్యాలయంలో సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఆయన తెలంగాణ వ్యవసాయ విధానాలను అక్కడివారికి వివరించారు. వ్యవసాయపరంగా పెట్టాల్సిన పెట్టుబడులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Also Read: Mobile Phone: రాత్రిళ్లు బెడ్రూంలో మొబైల్ ఫోన్ వాడుతున్నారా.. అయితే బీఅలర్ట్