BRS Minister: అప్పుడు తెలంగాణ ఎలా ఉందో, ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలి!

రాష్ట్రం రాక ముందు తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

Published By: HashtagU Telugu Desk
Minister Gangula Kamalakar Meeting with Millers association

Minister Gangula Kamalakar Meeting with Millers association

BRS Minister: రాష్ట్రం రాక ముందు తెలంగాణ పరిస్థితి ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆయన కరీంనగర్ లో కుల ఆత్మీయ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ‘‘నగరానికి కూతవేటు దూరంలోనే ఉన్న కొత్తపల్లి ని అభివృద్ధి చేయాలని ఎవరికి మనసు రాలేదు..నేడు కొత్తపల్లి ఎవరు ఊహించని రీతిలో అభివృద్ధి చేశాం.. ఆనాటి నుండి ఈ రోజు వరకు పదవులు ఎన్ని వచ్చినా మీ మధ్యే ఉన్నా నేడు కాళేశ్వరం నీళ్లతో తెలంగాణ సస్యశ్యామలం అయింది…మండుటెండల్లో మత్తల్లు దుంకే పరిస్థితి. భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయి. ఆనాడు 1956లో చేసిన తప్పు తో తెలంగాణ ను ఆంధ్రలో బలవంతంగా కలిపితే మన వనరులు దోచుకున్నారు’’ అని గంగుల అన్నారు.

‘‘మళ్ళీ నేడు ఒక్క ఓటు తప్పు చేస్తే తెలంగాణ 50 ఏళ్ల వెనక్కి వెళ్లడంతో పాటు మన పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు ఆంధ్ర నాయకులు బీజేపీ కాంగ్రెస్ రూపంలో మళ్ళీ వచ్చి హైదరాబాద్ లో మకాం వేశారు..ఎక్కడ చిన్న అవకాశం దొరికినా తెలంగాణ ను మళ్ళీ ఆంధ్రలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్ సంపద దోచుకెళ్లాలని చూస్తున్నారు. 5 నెలల కాంగ్రెస్ పాలనకే కర్ణాటక లో ప్రజలు అల్లాడుతున్నారు..ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని పాదయాత్ర చేస్తున్నారు.

తెచ్చుకున్న తెలంగాణ దొంగల చేతిలో పెట్టకండి..ఢిల్లీలో బీజేపీ కాంగ్రెస్ లు ఒక్కటవుతయి..తస్మాత్ జాగ్రత్త. ఒక్క నెల నాకోసం కష్టపడితే 5 సంవత్సరాలు మీ కోసం కష్టపడతా నాపై పోటీ చేసిన నాయకులు ఎన్నికలప్పుడు తప్ప మళ్ళీ కనిపించిన పరిస్థితి లేదు..నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉన్నా..ఆలోచించండి’’ అని అన్నారు మంత్రి గంగుల.

  Last Updated: 01 Nov 2023, 04:56 PM IST