Site icon HashtagU Telugu

BRS Party: బీఆర్ఎస్ నాయకుడి పాడే మోసిన మంత్రి

Trs

Trs

BRS Party: బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు, భీంగల్ మాజీ జెడ్పిటిసి, మాజీ ఎంపిపి, సీనియర్ రాష్ట్ర నాయకులు కొండ ప్రకాష్ గౌడ్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. బుధవారం భీంగల్ లో జరిగిన ఆయన అంత్యక్రియల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. స్వయంగా పాడే మోసిన మంత్రి వేముల ప్రకాష్ గౌడ్ గారి పార్థివ దేహం పై గులాబీ కండువా కప్పి పూలతో ఘనమైన నివాళి అర్పించారు.

ప్రకాష్ గౌడ్ అంతిమ యాత్రలో ఆయన ఇంటి దగ్గర నుండి స్మశానవాటిక వరకు సుమారు 3కి. మీ మంత్రి కాలినడకన వచ్చి ఆయనపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. నిఖార్సైన ఉద్యమ కారున్ని కోల్పోవడం తనకు వ్యక్తి గతంగా ఎంతో బాధను కలిగిస్తోందని మంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. ఉద్యమ సమయం నుంచి ఆయనతో ఉన్న జ్ఞాపకాలను ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. దివంగత ప్రకాష్ గౌడ్ కుటుంబ సభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపి,మనోధైర్యం చెప్పారు. ప్రకాష్ గౌడ్ అంతిమయాత్రకు బిఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Also Read: Patnam Mahender Reddy: మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పట్నం, తొలి ఫైల్ పై సంతకం