Site icon HashtagU Telugu

BRS : కేసీఆర్ అధ్యక్షతన 11న బీఆర్ఎస్ శాసన సభాపక్ష భేటీ

KCR Health Update

KCR Health Update

BRS : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈనెల 11 వ తేదీ (మంగళవారం) నాడు మధ్యాహ్నం ఒంటి గంటకు బీఆర్ఎస్ శాసనసభాపక్షం సమావేశం జ‌ర‌గ‌నుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో జర‌గ‌నుంది. ఈ స‌మావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజ‌రుకానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నాటి నుంచి కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకాకపోవడం తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. గత బడ్జెట్ ప్రవేశ పెట్టిన రోజు అసెంబ్లీకి హాజరైన కేసీఆర్ ఆ తర్వాత మళ్లీ హాజరుకాలేదు.

Read Also: India- America: అమెరికా నుండి భార‌త్ దిగుమ‌తి చేసుకునే వ‌స్తువులివే!

అయితే.. ఈ బడ్జెట్ సమావేశాలకు మాత్రం కేసీఆర్‌ హాజరుకావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ నేతలకు సమాచారం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు ప్రకటన రావడంతో కేసీఆర్ అసెంబ్లీకి రావడం ఖాయమైనట్లు అర్థం అవుతోంది. కాగా, బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకే కేసీఆర్ హైదరాబాద్ వస్తున్నారని.. అందుకే ఇక్కడే పార్టీ ఎమ్మెల్యేల సమావేశం ఏర్పాటు చేసినట్లు వారు వివరిస్తున్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఒక వేళ కేసీఆర్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకపోతే ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లోనే శాసనసభా పక్ష సమావేశం జరిగేదని పార్టీ నేతలు చెబుతున్నారు.

Read Also: Lokesh : ఒకేరోజు 105 అభివృద్ధి కార్యక్రమాలు..ఎమ్మెల్యేకి మంత్రి లోకేశ్ అభినందనలు