Site icon HashtagU Telugu

Delhi Liquor Scam: లిక్కర్ స్కాములో సంచలనం: అప్రూవర్ గా మారిన కవిత మాజీ ఆడిటర్

Delhi Liquor Scam:

New Web Story Copy (56)

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాములో మరో సంచలనం. ఈ కేసులో త్వరలోనే కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్టు తెలుస్తుంది. విషయం ఏంటంటే.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్ గా మారారు. దీంతో బీఆర్ఎస్ లో ఓ రకమైన టెన్షన్ నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే దినేష్ అరోరాని సీబీఐ అరెస్ట్ చేసింది. పలు కోణంలో అతనిని విచారించింది. చివరికి దినేష్ అరోరా అప్రూవర్ గా మారాడు. ఇక ఇదే కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబు తాజాగా అప్రూవర్ గా మారడం సంచలనంగా మారింది.

బుచ్చిబాబు అప్రూవర్ గా మారడంతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్టు తెలుస్తుంది. ఢిల్లీ మద్యం పాలసీలో సౌత్ గ్రూప్ కు బుచ్చిబాబు, అరుణ్ పిళ్ళై రిప్రజెంటర్ గా వ్యవహరించినట్టు సమాచారం. ప్రస్తుతం ఈ ఇద్దరు అప్రూవర్ గా మారారు. మరోవైపు ఢిల్లీ లిక్కర్ పాలసీలో సీబీఐ తాజాగా మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 209 పేజీలతో అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ క్రమంలో బుచ్చిబాబు అప్రూవర్ గా మారడంతో బీఆర్ఎస్ లో టెన్షన్ నెలకొంది. బుచ్చిబాబు అప్రూవర్ గా మారడం ద్వారా కవితకు ఏమైనా సమస్య తలెత్తుతుందా అన్న కోణంలో పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాగా.. ఢిల్లీ లిక్కర్ పాలసీలో భారీగా మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించింది. అయితే కవితను నిందితురాలిగా కాకుండా అనుమానితురాలిగానే చూసింది. ఈ మేరకు కవిత బ్యాంకు లావాదేవీలపై ఫోకస్ చేసింది. ఈడీ కస్టడీలో ఉన్న అరుణ్ పిళ్ళై, మనీష్ సిసోడియాతో కలిపి విచారించింది.

Read More: Ask KTR : మంత్రి కేటీఆర్ ఎక్క‌డ‌? మౌనిక మ‌ర‌ణ పాపం ఎవ‌రిది?