BRS Party: తెలంగాణ లో బిఆర్ఎస్ పటిష్టం గా ఉంది: కడియం శ్రీహరి

BRS Party: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో బయలుదేరి నేషనల్ హైవేపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ లోకసభ ఎన్నికల ముందు భారత రాష్ట్ర సమితిని మానసికంగా దెబ్బతీయలని ఆలోచన తో కుట్రపన్నుతున్నారని ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం భారత రాష్ట్ర సమితి పార్టీ ని అనగదొక్కే క్రమం లో బాగమేనని అన్నారు. సికింద్రబాద్ […]

Published By: HashtagU Telugu Desk
Kadiyam Srihari

Kadiyam Srihari

BRS Party: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో పార్టీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో బయలుదేరి నేషనల్ హైవేపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ లోకసభ ఎన్నికల ముందు భారత రాష్ట్ర సమితిని మానసికంగా దెబ్బతీయలని ఆలోచన తో కుట్రపన్నుతున్నారని ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం భారత రాష్ట్ర సమితి పార్టీ ని అనగదొక్కే క్రమం లో బాగమేనని అన్నారు. సికింద్రబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోడీ, అదే రోజు ఈడీ లు అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. ప్రజాస్వామ్య వాదులందరు దీన్ని తీవ్రంగా ఖండించాలన్నారు.మొన్న జరిగిన ఎన్నికల్లో కొద్దీ శాతం ఓట్లతో మాత్రమే బిఆర్ఎస్ ఓడిందని తెలిపారు. తెలంగాణలో బారాస పటిష్టంగా ఉందన్నారు.

మానసికంగా కృంగదీయడం కోసమే ప్రతిపక్షాలను కాంగ్రెస్ మరియు బిజెపి పార్టీలు చేర్చుకుంటున్నాయన్నారు. స్టేషన్ ఘనపూర్ కార్యకర్తలందరు భారత రాష్ట్ర సమితి వెంటే ఉన్నామన్నారు. ప్రజల పక్షాన మా గొంతు ఎత్తుతామని ,బిజెపి దాడులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. 370 సీట్లు గెలిచిన బిజెపి కి అభ్యర్థులు దొరకక అభ్యర్థులను వివిధ పార్టీల నుండి చేర్చుకోవడం సిగ్గు చేటని దూయ్యాబట్టారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే, రైతుల పైన ప్రేమ ఉంటే వాళ్ళ పంటలకు నీరిచ్చి రైతులను కాపాడాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతుల కోసం ,మరియు హక్కుల కోసం పోరాడుతామన్నారు. అనంతరం ధర్నా కేంద్రం నుండి ఘనపూర్ శివునిపల్లి రోడ్డు గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

  Last Updated: 16 Mar 2024, 06:12 PM IST