BRS Ex mp: 2 లక్షల కొత్త ఉద్యోగాల భర్తీ అని చెప్పి… 60 ఉద్యోగాల నోటిఫికేషన్ తో సరిపెట్టారు

  • Written By:
  • Updated On - February 7, 2024 / 12:49 AM IST

BRS Ex mp: అధికారంలోకి రాగానే 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ,ఎమ్మెల్సీ కోదండరాం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 60 గ్రూప్ -1 ఉద్యోగాల నోటిఫికేషన్ తో ఆరంభం చేసిందని …ఈనెలాఖరు వరకు వివిధ ప్రభుత్వ శాఖల్లో (ఒక లక్ష 99940 )ఉద్యోగ ఖాళీలను గుర్తించి ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేయాలని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు మాట్లాడుతూ ఉద్యోగ ఖాళీల వివరాలు స్పష్టం చేయడంతో పాటు వెంటనే నోటిఫికేషన్లు ఇస్తే నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి వీలుంటుందని, ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కాంగ్రెస్ ప్రభుత్వం భర్తీ చేయాలని కోరారు.

సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం గార్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారని, మిగతా (ఒక లక్ష 99940) ప్రభుత్వ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో నిరుద్యోగులకు స్పష్టతనివ్వాలని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల కాలంలో 1,60083 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిందని, 42 వేల ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించిందని కోర్టు కేసుల కారణంగా నియామకాలు జరగలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 2024 డిసెంబర్ 31 నాటికి ఇస్తామన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల వేల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.