BRS Ex Minister: మాజీ మంత్రి జోగు రామన్న ,ఎమ్మెల్యే అనిల్ జాదవ్ , ఖానా పూర్ బీఆర్ఎస్ ఇంచార్జి జాన్సన్ నాయక్ ప్రెస్ మీట్ తెలంగాణ భవన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న మాట్లాడారు. ‘‘ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కోసం వచ్చిన రైతులపై లాఠీ చార్జీ చేయడం అమానుషం. కేసీఆర్ హాయం లో పదేళ్లలో రైతులకు ఇలాంటి కష్టాలు రాలేదు. కేసీఆర్ హయం లో రైతులు అడిగిన విత్తనాలు దోరికేవి. సీఎం రేవంత్ అపుడు ఐపీఎల్ మ్యాచ్ లో బిజీ గా ఉన్నాడు ..ఇపుడు అధికార చిహ్నాలు మారడం లో బిజీ గా ఉన్నారు’’ అని అన్నారు.
‘‘రేవంత్ రెడ్డి కి ఎపుడూ రైతుల గురించి పట్టడం లేదు. ఉపముఖ్యమంత్రి భట్టి ఇక్కడి సమస్యలు వదిలేసి వేరే రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్తున్నారు. కాంగ్రెస్ ఆరు నెలల పాలనలో రైతులు ఆగమయ్యారు. వ్యవసాయ మంత్రి రాష్ట్రం లో విత్తనాల కొరత లేదని అబద్దాలు మాట్లాడుతున్నారు. ..రైతులు మళ్ళీ కమిషన్ ఏజెంట్లను ఆశ్రయించడమే ఇందిరమ్మ రాజ్యమా’’ అని జోగు ప్రశ్నించారు.
‘‘ప్రజా సమస్యల పై సీఎం కు మంత్రులకు శ్రద్దలేదు. …మంత్రి జూపల్లి కి తన శాఖ లో ఏం జరుగుతుందో తెలియక పోవడం శోచనీయం. ..సీఎం రేవంత్ కేసీఆర్ ఆనవాళ్లను తొలగించడం కాదు రైతు సమస్యల పై ద్రుష్టి పెట్టండి. సీఎం కు వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ రైతుల బాగోగుల మీద లేదు. …వర్షాకాలం సాగునీటి విడుదల మీద ప్రభుత్వానికి ఓ కార్యాచరణ లేదు. కాంగ్రెస్ అధికారం లోకి వచ్చిన తర్వాత 250 మంది రైతులు ఆత్మ హత్య చేసుకున్నారు ’’ అని ఆయన అన్నారు.