Site icon HashtagU Telugu

Telangana Politics : వామ్మో వీళ్లంతా కారు దిగి..కాంగ్రెస్ గూటికి చేరుతున్నారా..?

brs and bjp key leaders

brs and bjp key leaders

తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) రోజురోజుకు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు మరో మూడు , నాల్గు నెలలు (2023 Telangana Elections) ఉన్నప్పటికీ ఇప్పటి నుండి పొలిటికల్ హిట్ పెరుగుతుంది. రెండుసార్లు రాష్ట్రంలో విజయం సాధించిన అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS)..ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ (BRS Hat Trick Victory) కొట్టాలని చూస్తుంది. అందుకే ఈసారి మిగతా పార్టీల కంటే ముందే గులాబీ బాస్ కేసీఆర్ (CM KCR) తమ అభ్యర్థులను ప్రకటించి (BRS Candidates List) చేతులు దులుపుకున్నారు. చేతులైతే దులుపుకున్నారు కానీ చివర్లో చేతులకు మట్టి అంటుందని గ్రహించలేకపోయారు.

అదేలా అనుకుంటున్నారా…? గతంలో మాదిరిగానే ఈసారి కూడా గులాబీ బాస్ సిట్టింగ్ లకు టికెట్ ఇచ్చారు. చాలాచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల (BRS Sitting MLAs)కు వ్యతిరేకత ఉన్నప్పటికీ అవేమి పట్టించుకోకుండా మరోసారి వారికే ఛాన్స్ ఇచ్చాడు. దీంతో ఆ నియోజకవర్గ ప్రజలు కేసీఆర్ (KCR) ఫై అభిమానం..ప్రేమ ఉన్నప్పటికీ సదరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఫై కోపం తో ఈసారి బిఆర్ఎస్ కు ఓటు (BRS Vote) వెయ్యకూడదని ఫిక్స్ అవుతున్నారు. మరోపక్క వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానంలో ఆ టికెట్ ఆశించిన వారు కూడా ఉన్నారు. ఈసారి మాకే కేసీఆర్ సార్ టికెట్ ఇస్తారని గప్పెడు ఆశతో ఎదురుచూస్తూ వచ్చారు. తీరా వారికీ టికెట్ ఇవ్వకుండా మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకే అవకాశం ఇవ్వడం తో వారు తట్టుకోలేకపోతున్నారు. కొన్ని చోట్ల మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా కొత్త వారికీ ఛాన్స్ ఇచ్చాడు కేసీఆర్. ఇది కూడా సదరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు , వారి అనుచరులు తట్టుకోలేకపోతున్నారు. ఇలా టికెట్ ఆశించిన వారు..టికెట్ దక్కని వారు..ఇలా ఇద్దరు కూడా ఇప్పుడు బిఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ (Congress Party) వైపు మొగ్గు చూపిస్తున్నారు.

Read Also : Chandrababu Scam: చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ మంత్రులు

కర్ణాటక ఎన్నికల ఫలితాల (Karnataka Election Results) ముందు వరకు కూడా తెలంగాణ లో బిజెపి హావ కనిపించింది. బిఆర్ఎస్ ను ఢీ కొట్టాలంటే అది బిజెపి (BJP) వల్లే అని చాలామంది అనుకోని ఆ పార్టీ లో చేరారు. కానీ కర్ణాటక ఫలితాలు వారి ఆశలను తారుమారు చేసాయి. ఈ ఫలితాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ జోష్ పెరిగింది. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనని నేతలంతా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాదు కార్యకర్తల్లో కూడా జోష్ పెంచారు. ఇలా కాంగ్రెస్ పార్టీ కి బలం రోజు రోజుకు పెరుగుతుంది. ఇక ఇప్పుడు బిఆర్ఎస్ టికెట్ దక్కని వారితో పాటు కాంగ్రెస్ , బిఆర్ఎస్ నుండి బిజెపి లో చేరిన వారు సైతం తిరిగి కాంగ్రెస్ వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఇప్పటికే పలువురు బిఆర్ఎస్ నేతలు..కాంగ్రెస్ నేతలను కలవడం..టికెట్ ఫిక్స్ చేసుకోవడం చేసుకునే పనిలో పడ్డారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..బిఆర్ఎస్ నుండి దాదాపు 10 మంది కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ పది మంది పేర్లు కూడా సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి.

01. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

02. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

03. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

04. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత రావు

05. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్

06. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు

07. జిట్టా బాలకృష్ణారెడ్డి

08. మాజీ ఎంపీ వివేక్ వెంక‌ట‌స్వామి

09. మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి

10. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి తో పాటు పలువురు ముఖ్యనేతలు కారు దిగి..కాంగ్రెస్ గూటికి చేరబోతున్నట్లు బలంగా వినిపిస్తున్నాయి. నిజంగా వీరంతా కాంగ్రెస్ పార్టీ లో చేరితే..ఇక కాంగ్రెస్ పార్టీ కి తిరుగులేదని..అధికారం పక్క కాంగ్రెస్ పార్టీదే నని కాంగ్రెస్ శ్రేణులు చెపుతున్నారు. ఇప్పటికే ఈ పదిమంది పీసీసీతో సీక్రెట్‌గా సమావేశాలు నిర్వహించినట్లుగా చెపుతున్నారు. ఈ నెల 16న హైదరాబాద్‌లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు (CWC Meeting in Hyderabad) జరగనున్న విషయం తెలిసిందే. దీంతో చేరికలన్నీ ఒకేసారి చేపట్టి ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాస్టర్ వేసినట్లుగా తెలుస్తోంది. ఇది ఏమైనప్పటికి రాబోయే ఎన్నికల్లో మాత్రం BRS vs Congress పోటీ అనేది గట్టిగా ఉండబోతుందని అర్ధం అవుతుంది.