Site icon HashtagU Telugu

Social Media: చిచ్చుపెట్టిన సోషల్ మీడియా, చెల్లిని చంపేసిన అన్న!

Crime

Crime

సోషల్ మీడియా రాకతో మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. ఫేస్ బుక్, ఇన్ స్టా, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా వేదికలు గొడవలకు దారితీస్తున్నాయి. ఓ చెల్లి సోషల్ మీడియాలో ఎక్కువ సేపు ఉన్నందుకే రొకలి బండతో కొట్టి చంపేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడె జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌లో సోమవారం విషాద ఘటన జరిగింది. అజ్మీర సింధు(21), తల్లి, సోదరుడు హరిలాల్ రాజీవ్‌నగర్‌లో నివాసముంటున్నారు. ఆమె ఎక్కువ టైం సోషల్ మీడియాలోనే గడుపుతుంది. అది నచ్చక సోదరుడు హరిలాల్ చాలాసార్లు మందలించాడు.

తరచూ  ఇద్దరు  గొడవ పడుతూ ఉండేవారు.  సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో హరిలాల్ కోపంతో రోకలిబండ తీసుకొని ఆమె తలపై కొట్టడంతో సింధు తీవ్రంగా గాయపడింది.  సింధు నిలువునా కుప్పకూలి పోయింది.  హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలపడంతో ఆస్పత్రికి తీసుకెళుతుండగా మధ్యలోనే మృతి చెందింది. మంగళవారం కుటుంబసభ్యులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండటంతో స్థానికులు అనుమానంతో ఆరా తీశారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. సోదరుడి క్షణికవేశానికి సొంత చెల్లి బలైంది.

Also Read: BRS Party: లోక్ సభలో బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం, మజ్లిస్ మద్దతు!