Raksha Bandhan 2023: సోదరిని తీసుకొచ్చేందుకు వెళ్తున్న అన్న రోడ్డు ప్రమాదంలో మృతి

Raksha Bandhan 2023: దేశవ్యాప్తంగా రక్షాబంధన్ సందడి మొదలైంది. తోబుట్టువులకు రాఖీ కట్టేందుకు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ల ఇంటికి బయలుదేరుతున్నారు. తోబుట్టవు ప్రేమకు ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ ని కొందరు రేపు ఆగస్టు 30న జరుపుకుంటుండగా, మరికొందరు ఆగస్టు 31న చేసుకుంటున్నారు. అయితే రక్షాబంధన్ పండుగ ఒకరి ఇంట్లో విషాదాన్ని నింపింది. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారాలో రక్షా బంధన్‌కు ముందే శోకసంద్రం నెలకొంది. సోదరిని తీసుకెళ్లేందుకు వెళ్తున్న తమ్ముడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

దుర్గేష్ వర్మ తన చెల్లిని తీసుకువెళ్లేందుకు ఆమె దగ్గరకు వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. పోలీసుల సమాచారం ప్రకారం.. దుర్గేష్ వర్మ (26) చాంద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పచ్‌గావ్ నివాసి. అతను రక్షా బంధన్ సందర్భంగా తన సోదరిని తీసుకురావడానికి హివర్ఖేడికి వెళ్తున్నాడు. చౌరాయ్ సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనం బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతనిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. సోదరుడి మరణంతో ఆ చెల్లి కన్నీరుమున్నీరు అవుతుంది.దుర్గేష్ మృతి ఆ ఇంట్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

Also Read: Delhi Alliance : పొత్తుకు చంద్ర‌బాబు సై! ముంద‌స్తు సంకేతాలు!!