Site icon HashtagU Telugu

Soldiers Faint : 30 డిగ్రీల ఎండకే మూర్ఛపోయిన సైనికులు.. ఎక్కడంటే ?

Soldiers Faint

Soldiers Faint

Soldiers Faint : మన ఇండియాలో 47 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత అంటే మామూలే!!

మనోళ్లు దర్జాగా ఎండలో తిరుగుతారు..

అదే బ్రిటన్ లో 30 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత అంటే వణుకు !!

ఇప్పుడు అక్కడ ఎండలతో జనం బెంబేలెత్తుతున్నారు..

ఇందుకు నిదర్శనంగా ఒక అరుదైన ఘటన జరిగింది.. అది కూడా సాక్షాత్తు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ప్రిన్స్ విలియమ్స్ ఎదుటే !!

ప్రతి ఏడాది  జూన్‌ 17న బ్రిటిష్ చక్రవర్తి అధికారిక పుట్టినరోజు సందర్భంగా “ట్రూపింగ్ ది కలర్” పేరుతో వేడుక నిర్వహిస్తారు. ఇందుకోసం లండన్ లో సైనికుల రిహార్సల్స్ జరుగుతోంది.. అసలే మండుతున్న ఎండ.. ఆపై 1,400 మందికిపైగా బ్రిటిష్ సైనికులు ట్యూనిక్స్, స్లాక్స్, బేర్ స్కిన్ టోపీలు ధరించారు.. ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కూడా తన పూర్తి సైనిక దుస్తులను ధరించాడు. అయితే  కొందరు సోల్జర్స్ కు ఉక్కపోత బాగా పెరిగింది. దాన్ని వాళ్ళ శరీరాలు తట్టుకోలేకపోయాయి. ఒక సైనిక ట్రోంబోనిస్ట్  మూర్ఛపోయి(Soldiers Faint) కుప్పకూలాడు.. నేలపై పడిపోయిన తర్వాత కూడా అతడు సన్నాయి వాయించడం ఆపలేదు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పనిపై అతడి డెడికేషన్ ను అందరూ మెచ్చుకుంటున్నారు. మరో ఇద్దరి సైనికులు కూడా ఆ వెంటనే మూర్ఛపోయారు. ఓ వైపు రిహార్సల్స్ కొనసాగిస్తూనే..మరోవైపు మూర్ఛపోయిన వారిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. శనివారం ఉదయం ఈ ఘటన జరిగినప్పుడు లండన్‌లో ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సీయస్ మాత్రమే ఉంది. ఇది వాళ్లకు ఎక్కువే. మనకు తక్కువ.

సోల్జర్స్ సొమ్మసిల్లి పడిపోయిన ఘటనపై  ప్రిన్స్ విలియం ఒక ట్వీట్‌ చేశారు. “ఈ ఉదయం కల్నల్ రివ్యూలో పాల్గొన్న ప్రతి సైనికుడికి చాలా కృతజ్ఞతలు. క్లిష్ట పరిస్థితుల్లో మీరందరూ నిజంగా చాలా బాగా వర్క్ చేశారు. ధన్యవాదాలు” అని చెప్పారు.