Site icon HashtagU Telugu

British Airways: వరుసగా రెండోరోజు బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ఐటీ ఫెయిల్యూర్.. పదుల సంఖ్యలో విమానాలు నిలిపివేత?

British Airways

British Airways

తాజాగా బ్రిటిష్ ఎయిర్ వేస్ ఐటీ వైఫల్యాన్ని ఎదుర్కొంది. వరుసగా రెండవ రోజు డజన్ల కొద్ది విమానాలను రద్దు చేసింది. సాంకేతిక సమస్య నాక్ ఆన్ ఎఫెక్ట్ కారణంగా మీరు 42 విమానాలు రద్దు అయ్యాయి. దాంతో 1600 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. అలాగే గురువారం రోజున అత్యంత బిజీగా ఉండే లండన్ లోని హీత్రు ఏర్పోర్ట్ నుంచి 80 విమానాలు ఆలస్యం అయ్యాయి. అయితే విమానాల్లో ఎక్కువ బాగా నడుస్తున్నప్పటికీ నాన్ ఆన్ ఎఫెక్ట్ వల్ల స్వల్ప దూరాల విమానాలను రద్దు చేస్తున్నట్లు తాజాగా బ్రిటిష్ ఎయిర్ వేస్ ప్రకటించింది.

ప్రయాణికులకు వేరే విమానాలు బుకింగ్ చేయడం లేదంటే డబ్బులును రీఫండ్ చేస్తున్నట్లు ఎయిర్ వేస్ సంస్థ తెలిపింది. ప్రయాణికులు ఏర్పోర్ట్ కు వెళ్లే ముందు విమానా స్టేటస్ తెలుసుకోవాలని తెలిపింది. విమానాలను రద్దు చేసిన అనంతరం ప్రయాణికులను సదరు సంస్థ క్షమాపణలు కూడా కోరింది. కాగా ఈ వీకెండ్ లో యూకే విమానాశ్రయం నుంచి 11,300 కంటె ఎక్కువ విమానాలు బయలుదేరాల్సి ఉందని డేటా సంస్థ సిరియం వెల్లడించింది. బ్రిటిష్ ఎయిర్ వేస్ గతంలో కూడా ఐటీ ఫెయిల్యూర్ సమస్యను ఎదుర్కొంది.

Exit mobile version