Site icon HashtagU Telugu

Uttarakhand : ఉత్త‌రాఖండ్‌లో పెళ్లి ఇంట్లో విషాదం.. డ్యాన్స్ చేస్తూ చ‌నిపోయిన‌..?

Deaths

Deaths

ఉత్తరాఖండ్‌లో ఓ పెళ్లి ఇంట్లో విషాదం నెల‌కొంది. పెళ్లికి ముందు రోజు డ్యాన్స్ చేస్తూ వధువు తండ్రి చనిపోయాడు.  ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలోని వధువు ఇంట్లో మెహందీ వేడుకలో వధువు తండ్రి డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా డ్యాన్స్ ఫ్లోర్‌పై ఆమె తండ్రి ప‌డిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. పోలీసులు వ‌ధువు తండ్రి మృతదేహాన్ని శవపరీక్షకు పంపించారు. కొంతమంది కుటుంబ సభ్యులు వివాహ వేడుక జరగాల్సిన హల్ద్వానీకి వెళ్లిన తర్వాత ఈ ఘటన జరిగింది. ఆదివారం సాధారణ వేడుకలో వధువు వివాహం జరిగింది. వధువు కన్యాదానాన్ని ఆమె మేనమామ చేశారు.