Uttar Pradesh: మరికొద్ది సేపట్లో పెళ్లి.. ఇంతలో షాక్ ఇచ్చిన వధువు.. చివరికి?

తాజాగా ఉత్తరప్రదేశ్ లో కాసేపట్లో పెళ్లి జరగకుండా ఇంతలో వధువు తీసుకున్న ఒక నిర్ణయంతో అందరు ఒక్కసారిగా షాక్ అవడంతో పాటు ఊహించని పరిణామాలు చోటు

Published By: HashtagU Telugu Desk
Uttar Pradesh

Uttar Pradesh

తాజాగా ఉత్తరప్రదేశ్ లో కాసేపట్లో పెళ్లి జరగకుండా ఇంతలో వధువు తీసుకున్న ఒక నిర్ణయంతో అందరు ఒక్కసారిగా షాక్ అవడంతో పాటు ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌కు చెందిన యువతికి మీర్జాపూర్‌కు చెందిన యువకుడితో వివాహం నిశ్చయమైంది. జూన్ 3న పెళ్లి జరిపించేలా ఇరు కుటుంబాల వారూ మాట్లాడుకున్నారు. పెళ్లి రోజు దగ్గరపడడంతో రెండు కుటుంబాల వారు ఏర్పాట్లలో మునిగిపోయారు. చూస్తుండగానే పెళ్లి రోజు వచ్చేసింది. దీంతో యువతి గ్రామానానికి బంధువులంతా చేరుకున్నారు.

మరోవైపు వరుడు కూడా వధువు గ్రామానికి వచ్చేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఈ సమయంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఉన్నట్టుండి వధువ కనిపించకపోవడంతో అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. చుట్టుపక్కల అంతా వెతికినా ఎక్కడా ఆమె కనిపించకపోవడంతో వరుడికి ఏం సమాధానం చెప్పాలా అని తల్లిదండ్రులు ఆందోళన చెందారు. చివరకు తమ కూతురు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. మరోవైపు విషయాన్ని వరుడితో పాటూ అతడి తల్లిదండ్రులకు తెలియజేశారు.

వధువు బంధువుల్లో వేరే యువతిని ఇచ్చి వివాహం చేసేలా మాట్లాడుకున్నారు. దీనికి అంతా అంగీకరించడంతో అదే ముహూర్థానికి వివాహం జరిగిపోయిది. అయితే ఈ క్రమంలో పారిపోయిన వధువును గ్రామంలోని పాఠశాలలో పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా, తాను UPSCకి ప్రిపేర్ కావాలనుకుంటున్నానని, ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పినా వినిపించుకోకుండా పెళ్లికి బలవంతంగా ఒప్పించారని చెప్పింది. తానే ఇంటి నుంచి పారిపోయానని, ఎవరి బలవంతమూ లేదని యువతి తెలిపింది. అయితే ఆమె తండ్రి ఫిర్యాదు మేరకు వధువు పారిపోవడం వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

  Last Updated: 08 Jun 2023, 09:36 PM IST