Site icon HashtagU Telugu

Local Body Elections : తెలంగాణ లో పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పడినట్లేనా..?

Telangana Local Body Reservations And Elections

స్థానిక ఎన్నికలు (Local Body Elections) మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణను వాయిదా వేయాలని యోచిస్తోంది. ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. దీంతో పూర్తి స్పష్టత వచ్చేవరకు ఎన్నికలు చేపట్టకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Caste Census Survey : తెలంగాణలో మరోసారి కులగణన – భట్టి

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే కులగణన సర్వే పూర్తయిందని, అయితే 3.1 శాతం మంది ఈ సర్వేలో పాల్గొనలేదని తెలిపారు. అందువల్ల, మరోసారి కులగణన సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయన్న అంశం ఇప్పుడు స్పష్టత లేకుండా పోయింది. బీసీ రిజర్వేషన్లపై కేంద్రం నుంచి ఆమోదం లభించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఒకవేళ కేంద్రం అనుమతి ఆలస్యం అయితే, ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.