Site icon HashtagU Telugu

Monkeypox Death Case : ఆ దేశంలో మంకీపాక్స్ తొలి మ‌ర‌ణం.. ఆందోళ‌న‌లో ప్ర‌జ‌లు

Monkey Pax

Monkey Pax

మంకీపాక్స్ వ్యాధి ప్ర‌పంచ వ్యాప్తంగా ఆందోళ‌న క‌లిగిస్తుంది. బ్రెజిల్ దేశంలో మొట్టమొదటి మంకీపాక్స్ సంబంధిత మరణాన్ని ఆ దేశం ఆరోగ్య‌శాఖ ధృవీకరించింది. ఆగ్నేయ మినాస్ గెరైస్ రాష్ట్ర రాజధాని బెలో హారిజోంటేలో శుక్రవారం ఈ కేసు నమోదైంది. బాధితుడు 41 ఏళ్ల వ్యక్తి, అతను క్యాన్సర్‌తో సహా ఇతర అనారోగ్య కార‌ణాల‌తో చికిత్స పొందుతున్నాడు. వ్యాధి సోకిన తర్వాత అతని ఆరోగ్యం క్షీణించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆ వ్యక్తిని బెలో హారిజాంటేలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ అతనికి మంకీపాక్స్‌ వ్యాధి నిర్ధార‌ణ అయింది. బ్రెజిల్‌లో బుధవారం నాటికి 978 మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రస్తుత వ్యాప్తిని గ్లోబ‌ల్ హెల్త్ ఎమ‌ర్జెన్సీగా ప్ర‌క‌టించింది.

Exit mobile version