Site icon HashtagU Telugu

Boys Gambling : కదులుతున్న కారులో జూదం ఆడుతున్న కుర్రకారులు..!

Boys Gambling using Cars Technology

Peka

టెక్నాలజీ (Technology) ని సరైన మార్గంలో ఉపయోగిస్తే సరే సరి.. లేదంటే దానివల్ల అనర్థాలు కూడా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగని పూర్తిగా టెక్నాలజీపైనే ఆధారపడినా ప్రమాదమేనని అంటున్నారు. టెక్నాలజీని ఎలా వాడుకోకూడదో చెప్పడానికి కొందరు యువకులు (Boys) చేసిన ఈ పనే చక్కని ఉదాహరణ. మహీంద్రా సంస్థ (Mahindra) తీసుకొచ్చిన ఎక్స్‌యూవీ 700 (XUV 700) మోడల్‌ కారులో అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్‌ అసిస్టెంట్‌ సిస్టమ్‌ (ADAS) టెక్నాలజీని ఉపయోగించిన సంగతి తెలిసిందే. ఇది డ్రైవర్‌కు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూ ఉంటుంది. అనుకోకుండా ఏదైనా అడ్డువస్తే వెంటనే డ్రైవర్‌ని అలర్ట్‌ చేస్తుంది. ఆటోడ్రైవింగ్‌ (Auto Driving) వెసులుబాటు కూడా ఈ కారులో ఉంది. దీనినే అదునుగా తీసుకున్న కొంతమంది యువకులు (Boys) స్టీరింగ్‌ వదిలేసి కదులుతున్న కారులోనే జూదం (Gambling) ఆడటం మొదలు పెట్టారు.

ఎక్కడ జరిగిందో తెలియదు గానీ, దీనికి సంబంధించిన వీడియో మాత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై రకరకాల కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ‘ ఎవరూ సీట్‌ బెల్టు పెట్టుకోలేదు. డ్రైవింగ్‌పై ఏకాగ్రత లేదు. ట్రాఫిక్‌ నిబంధనలను పాటించకుండా రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. సంబంధిత అధికారులు వీరిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి’ అని ఒక యూజర్‌ కామెంట్‌ చెయ్యగా.. ADAS కేవలం ఒక టెక్నాలజీ మాత్రమేనని, అది ఒకవేళ కరెక్ట్‌గా పని చెయ్యకపోతే మీ జీవితాలు ఏమవుతాయో ఒక్కసారైనా ఆలోచించారా? అని మరో యూజర్‌ కామెంట్‌ చేశాడు. ‘ఆటో డ్రైవ్‌ అన్నిసార్లు పని చెయ్యకపోవచ్చు.. జాగ్రత్త బ్రదర్స్‌’ అంటూ మరొకరు ఇలా.. కామెంట్ల వర్షం గుప్పిస్తున్నారు.

Also Read:  Sabarimala Devotees: కిక్కిరిసిన శబరిమల. ఒక్క రోజులోనే లక్షకు పైగా భక్తులు..