Site icon HashtagU Telugu

Boycott KFC: చిక్కుల్లో కేఎఫ్‌సీ.. అస‌లు మ్యాట‌ర్ ఇదే..!

Ban Kfc

Ban Kfc

ప్రముఖ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ కేఎఫ్‌సీ సంస్థ చిక్కుల్లో పడింది. ప్రస్తుతం సోష‌ల్ మీడియా వేదిక‌ల్లో ఒక‌టైన ట్విట్టర్‌లో బాయ్‌కాట్ కేఎఫ్‌సీ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. కేఎఫ్‌సీ బ్రాండ్ పాకిస్థాన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో కశ్మీర్‌ఖు సంఘీభావం తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టింది. మీరు మా ఆలోచనలను ఎప్పటికీ విడిచిపెట్టలేదని, అదే మీకు భ‌విష్య‌త్తులో శాంతిని కలిగిస్తాయని మేము ఆశిస్తున్నామని కేఎఫ్‌సీ పోస్ట్ చేసింది. అంతే కాకుండా కశ్మీర్, కాశ్మీరీలకు చెందినదని పోస్ట్ చేసింది. దీంతో కేఎఫ్‌సీ పోస్ట్ పై ఇండియా నెటిజ‌న్లు విరుచుకుప‌డుతున్నారు. పాకిస్థాన్ కశ్మీర్ దినోత్స‌వంగా జరుపుకునే ఫిబ్రవరి 5వ‌ తేదీన‌ ఈ పోస్టును ఫేస్‌బుక్ షేర్ చేయ‌డంతో భార‌త నెటిజ‌న్లు కేఎఫ్‌సీ పై ఆగ్ర‌హం వ్య‌క్తం వ్య‌క్తం చేస్తున్నారు.

ట్విట్ట‌ర్‌లో దీంతో #BoycottKFC ట్యాగ్‌లో, పెద్దఎత్తున ట్వీట్లు చేయడంతో అది కాస్తా ఇప్పుడు జోరుగా ట్రెండ్ అవుతోంది. పాకిస్తాన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేసిన ఈ ట్వీట్‌ను డిలీట్ చేసినా, అప్పటికే పలువురు నెటిజన్లు స్క్రీన్ షాట్లను తీసి షేర్ చేయడంతో కేఎఫ్‌సీకి చిక్కులు తెచ్చిపెట్టింది. దీంతో జ‌రిగిన న‌ష్టాన్ని గ్ర‌హించిన కేఎఫ్‌సీ, డ్యామేజ్ కంట్రోల్‌లో భాగంగా పోస్ట్‌ను డిలీట్ చేసి, భార‌త్‌కు క్ష‌మాప‌ణ‌లు తెల్పింది. అయితే అప్పటికే తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్న ఇండియా నెటిజన్లకు మాత్రం కేఎఫ్‌సీ పై ఓ రేంజ్‌లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఇటీవ‌ల కశ్మీర్ అంశంపై పాకిస్థాన్‌కు మద్దతుగా హ్యుందాయ్ సంస్థ‌ విడుదల చేసిన పోస్ట్ తీవ్ర దుమారాన్ని రేపిన సంగ‌తి తెలిసిందే. దీంతో పాకిస్తాన్ అనుకూల హ్యుందాయ్ కార్లను భారతీయులు పట్టించుకోవద్దని డిమాండ్ చేస్తూ #BoycottHyundai అనే హ్యాష్‌ట్యాగ్ కొద్ది రోజులుగా అంతర్జాతీయంగా ట్రెండింగ్‌లో ఉంది.