Site icon HashtagU Telugu

Secunderabad: తప్పతాగి పడిపోయిన తల్లిదండ్రులు.. చిన్నారి కిడ్నాప్?

Secunderabad

Secunderabad

ప్రస్తుత రోజుల్లో చాలా మంది మద్యానికి బాగా అలవాటు పడిపోయి ఏం చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారు ఎక్కడ ఉన్నారు అన్న సంగతిని కూడా మర్చిపోతున్నారు. చాలామంది అయితే మద్యం మత్తులో తన అనుకున్న వాళ్ళని కూడా కడ తీర్చడానికి వెనుకడవడం లేదు. ఈ మధ్యకాలంలో స్త్రీలు కూడా ఈ మద్యానికి పూర్తిగా అలవాటు పడిపోయారు. అయితే ఇలా మద్యానికి బాగా అలవాటు పడిపోయిన వారిని చాలామంది ఆసరాగా తీసుకొని మోసాలకు పాల్పడడం దొంగతనాలు చేయడం లాంటివి చేస్తున్నారు.

తాజాగా అలాంటి ఘటన ఒకటి సికింద్రాబాద్లో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు మద్యం సేవించి పడిపోయి ఉండడంతో వారి దగ్గర ఉన్న చిన్నారిని ఎవరో కిడ్నాప్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పింకీదేవి, అజయ్‌ పటాన్‌ చెరులోని ఇస్నాపూర్ లో కూలి పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. అయితే దంపతులకు తరచూ మద్యం సేవిస్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే ఈనెల 4న స్వగ్రామానికి వెళ్లేందుకు తమ నలుగురి పిల్లలతో వారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.

రైల్వేస్టేషన్‌కు చేరే సమయంలో దంపతులు మద్యం మద్దతులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ముగ్గురు చిన్నారులు వారి వెంటే ఉండగా ఏడు నెలల కన్నయ్య ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. చిన్నారి కోసం రైల్వేస్టేషన్‌ పరిసరాల్లో వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది. దీంతో దంపతులు గోపాలపురం పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసుల కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. బాలుడిని ఒక మహిళ అపహరించినట్లు ఆమె చెన్నైలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయంపై ఇంకా విచారణ కొనసాగుతోంది. బాలుడిని అపహరించిన మహిళ కోసం వెతికే పనిలో పడ్డారు పోలీసులు. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Exit mobile version