Site icon HashtagU Telugu

Telangana: యూట్యూబ్ వీడియోలు చూసి ఉరి వేసుకున్న 11 ఏళ్ల బాలుడు

Telangana

New Web Story Copy (23)

Telangana: టెక్నాలజీ మనుషులకు శాపంగా మారుతుంది. అవసరం మేరకు మాత్రమే ఏదైనా సురక్షితం. పరిమితికి మించితే ప్రతీది హానికరమే. ప్రస్తుత కాలంలో మొబైల్ లేనిదే బ్రతుకే లేదన్నట్టుగా తయారైంది. యూట్యూబ్ వీడియోస్ చూస్తూ అనుకరించడం పరిపాటిగా మారింది. ఎంటర్టైన్మెంట్ వరకు వీడియోలు చూడటంలో తప్పు లేదు. కానీ వాటిని అనుకరిస్తూ ఎందరో ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు. తాజాగా తెలంగాణాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూట్యూబ్ వీడియోలను అనుకరిస్తూ 11 ఏళ్ల బాలుడు ఉరివేసుకుని మృతి చెందాడు. ఎల్లారెడ్డిపేట మండలం కిష్టానాయక్‌ తండాలో 6వ తరగతి చదువుతున్న ఉదయ్‌ తన ఇంట్లోని ఓ గదిలో ఉరివేసుకుని మృతి చెందాడు. ఆ బాలుడు యూట్యూబ్‌లో వీడియోలు చూస్తూ వాటిని అనుసరించేవాడని స్థానికులు చెప్తున్నారు. ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత ఉదయ్ మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూస్తూ గదిలోకి వెళ్లి గదికి తాళం వేసుకున్నట్టు చెప్తున్నారు. అయితే ఎంతసేపటికీ తలుపు తీయకపోవడంతో తల్లిదండ్రులు తలుపులు బలవంతంగా పగలగొట్టారు. అప్పటికే ఉదయ్ మేకుకు కట్టిన గుడ్డను ఉపయోగించి ఉరి వేసుకున్నాడు.వెంటనే మండల కేంద్రంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు.

Also Read: Jagan MLA Scam : బ్యాంకుల్ని ముంచిన వైసీపీ ఎమ్మెల్యే