Site icon HashtagU Telugu

Delhi : ఢిల్లీలో విషాదం.. స్విమ్మింగ్‌పూల్‌లో ప‌డి బాలుడు మృతి

Death Representative Pti

Death Representative Pti

ఢిల్లీలో విషాదం నెల‌కొంది. ఢిల్లీలోని నరేలాలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లోని స్విమ్మింగ్ పూల్‌లో 12 ఏళ్ల బాలుడు మునిగిపోయాడు. ఈ ఘటన కస్తూరి రామ్‌ స్కూల్‌లో చోటుచేసుకుంది. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. పాఠ‌శాలలో ఎలాంటి భద్రత లేదని,.. అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు గార్డులు ఎలాంటి వాహనాన్ని అందించకుండా నిరాకరించారని కుటుంబ సభ్యులు తెలిపారు.