ఏపీలో రాజకీయ వేడి ఏ రేంజ్ లో ఉందో చెప్పాల్సిన పనిలేదు. వైసీపీ ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. రాష్ట్ర ప్రజలు బాగుపడాలంటే..రాష్ట్రం అభివృద్ధి కావాలంటే జగన్ సీఎం కుర్చీ దిగాల్సిందే అని ముక్తకంఠం తో చెపుతున్నారు. వరుసగా టీడీపీ , జనసేన , బిజెపి పార్టీ లు వైసీపీ ఫై దాడికి దిగాయి. ప్రభుత్వ వైఫల్యాలను సాక్ష్యాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నారు. ముఖ్యంగా జనసేనానాని..గతంలో ఎన్నడూ లేని దూకుడు కనపరుస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ప్రశ్నలకు ప్రభుత్వానికి ఏ సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు. అందుకే సినిమాలు ,పవన్ పెళ్లిలా గురించి , తన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ కాలం వెళ్లదీస్తున్నారు.
ఈ క్రమంలో మంత్రి బొత్స (Botsa Satyanarayana Challenge)..ప్రతిపక్ష పార్టీలకు ‘గుండు’ ఛాలెంజ్ విసిరి..బండ్ల గణేష్ ను గుర్తు చేసారు. విశాఖలోపార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ… ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన టీడీపీ, జనసేన పార్టీలకు లేదన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే ఆ పార్టీలకు స్కీములు గుర్తుకు వస్తాయని విమర్శించారు. కొంతమంది నేతలు మాట్లాడితే చేతులు, కాళ్లు చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పుతో కొడతామని అంటున్నారు. చెప్పులు ఎవరికి ఉండవు.. అందరికీ ఉంటాయన్నారు. నీ విధానం ఏమిటి, పార్టీ ఏమిటి అంటే జనసేనాని వద్ద సమాధానం లేదన్నారు. రాజకీయ దుకాణం తెరిచి పదిహేనేళ్లయిందని ఎద్దేవా చేశారు. వాలంటీర్లపై కూడా మాట మార్చారన్నారు. అసలు నువ్వు ఎవరు.. నీ స్టాండ్? ఏమిటో చెప్పాలన్నారు. ఈ రాజకీయాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం, రాజకీయాలు అంటేనే అసహ్యమేస్తోందని.. చెప్పుకొచ్చారు. వచ్చే ఉగాది తర్వాత టీడీపీ (TDP) పార్టీ, జనసేన (Janasena) ఉంటే తాను గుండు చేయించుకుంటానని బొత్స ఛాలెంజ్ విసిరారు.
ఈ ఛాలెంజ్ విన్న వారంతా నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) ను గుర్తు చేసుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో ఇలాగే ‘రాస్కోరా సాంబా!! హెడ్ లైన్స్‌లో పెట్టుకుంటావో.. బ్యానర్ ఐటమ్ గా వేసుకుంటావో నీ ఇష్టం. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతే రెండు రూపాయిల 7’O Clock బ్లేడ్‌లో పీక కోసుకుంటా’ అంటూ గణేష్ చేసిన ఛాలెంజ్ ని గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు పీక..ఇప్పుడు గుండు సేమ్ టూ సేమ్ అదే బ్లేడ్ అంటూ నెటిజనులు , జనసేన కార్యకర్తలు కామెంట్స్ వేస్తున్నారు.
Read Also : HYD :’ఊరెళ్లిపోదాం…మామ ..నాల్గు రోజులు హాలిడేస్ వచ్చాయిమామ’