Offbeat: నేను మీ బాస్‌ను.. నన్ను దయచేసి అలా పిలవద్దు!

వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న ఉద్యోగులకు, వారి బాస్‌లకు మధ్య జరిగే సంభాషణలు నెటిజన్ల ముఖాల్లో నవ్వులు పూయించేలా ఉంటాయి.

  • Written By:
  • Updated On - July 5, 2022 / 03:53 PM IST

వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్న ఉద్యోగులకు, వారి బాస్‌లకు మధ్య జరిగే సంభాషణలు నెటిజన్ల ముఖాల్లో నవ్వులు పూయించేలా ఉంటాయి. వాట్సాప్ వంటి సోషల్ మీడియా చానల్స్ ద్వారా చాటింగ్ చేసే క్రమంలో మనకు ఫ్రెండ్లీ మూడ్ వస్తుంది. ఆ మూడ్ లో మనం అందరితో ఫ్రెండ్లీగా చాట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఈక్రమంలో ఇటీవల ఓ ఉద్యోగితో బాస్ సంభాషణ బెడిసికొట్టింది. ఉద్యోగి తన ఫ్రెండ్లీ నేచర్ తో వాడిన ఒక పదం చూసి.. బాస్ కు బీపీ పెరిగింది. ఎవరి అభిప్రాయం ఎలా ఉన్నా రిమోట్‌ వర్క్‌తో టీం లీడర్‌లు, బాస్‌లు ఉద్యోగులతో వర్క్‌ చేయించుకోవడం తలనొప్పిగా మారింది.ఆ ఉద్యోగి పేరు శ్రేయాస్‌.. బాస్ పేరు సందీప్‌!! వాళ్ళ మధ్య జరిగిన వాట్సాప్‌ సంభాషణను మీరూ చూసేయండి. వర్క్‌ ఫ్రం హోం చేస్తున్న శ్రేయాస్‌ అనే యువతికి.. బాస్‌ సందీప్‌ వర్క్‌ అలాట్‌ చేశాడు. వాళ్ళ వాట్సాప్ సంభాషణ ఇలా సాగింది.

బాస్‌ సందీప్‌ : ఆ వర్క్‌ పూర్తయ్యిందా ?

శ్రేయాస్‌ : “హే.. నో,నాట్‌ ఎట్‌”

శ్రేయాస్‌ పెట్టిన ఈ మెసేజ్‌ ను చూసి బాస్‌కు కోపం వచ్చింది.

బాస్‌ సందీప్‌ :  హాయ్‌ శ్రేయాస్‌ నేను మీ బాస్‌ను నన్ను ‘హే’ అని పిలవొద్దు. ఉద్యోగులు బాస్‌తో మాట్లాడేందుకు కొన్ని పద్దతులుంటాయి. నీకు నా పేరు గుర్తు లేకపోతే హాయ్‌ అని మెసేజ్‌ చేయ్‌. దీంతో పాటు “డ్యూడ్”, “మ్యాన్”, “చాప్”, “చిక్” అని కూడా పిలవొద్దు.

ఉద్యోగి శ్రేయాస్‌ : “మంచిది. నేను మీతో వాట్సాప్‌ చాట్‌ చేస్తున్నాను. తప్పితే లింక్డిన్‌, మెయిల్‌ చేయలేదు. మిమ్మల్ని కించ పరచాలనే ఉద్దేశ‍్యం నాకు లేదు. నేను ప్రొఫెషనల్‌గా మీతో మాట్లాడాను.

ఈ వాట్సాప్‌ సంభాషణను ఉద్యోగి సోషల్‌ మీడియా ఫ్లాట్‌ ఫామ్‌ రెడ్డిట్‌లో పోస్ట్‌ చేశాడు. దీంతో అది వైరల్‌ అయింది.