Bopanna: చ‌రిత్ర సృష్టించిన భారత టెన్నిస్ స్టార్ రోహ‌న్ బొప‌న్న‌

భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొప‌న్న‌ (Bopanna) చరిత్ర సృష్టించాడు. రోహన్ బొప‌న్న‌- మాట్ ఎబ్డెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నారు.

  • Written By:
  • Updated On - January 24, 2024 / 10:01 AM IST

Bopanna: భారత టెన్నిస్ స్టార్ రోహన్ బొప‌న్న‌(Bopanna) చరిత్ర సృష్టించాడు. రోహన్ బొప‌న్న‌- మాట్ ఎబ్డెన్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీ-ఫైనల్‌కు చేరుకున్నారు. 44 ఏళ్ల రోహన్ బొప‌న్న‌- మాట్ ఎబ్డెన్ ద్వ‌యం క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 6-4, 7-6 (7-5)తో విజయం సాధించి సెమీ ఫైనల్‌కు చేరుకున్నారు. అదే సమయంలో ఈ విజయం తర్వాత రోహన్ బొప‌న్న‌- మాట్ ఎబ్డెన్ పురుషుల డబుల్స్‌లో ప్రపంచ నంబర్-1గా నిలిచారు.

అర్జెంటీనా జోడిని ఓడించారు

ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో అర్జెంటీనాకు చెందిన మాక్సిమో గొంజాలెజ్- ఆండ్రెస్ మోల్టెనీలు.. రోహన్ బొప‌న్న‌- మాట్ ఎబ్డెన్‌లతో తలపడ్డారు. కానీ రోహన్ బొప‌న్న‌- మాట్ ఎబ్డెన్ ప్రత్యర్థి ఆటగాళ్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. మాక్సిమో గొంజాలెజ్- ఆండ్రెస్ మోల్టెని 6-4, 7-6 (7-5)తో ఓడిపోయారు. ఈ విధంగా రోహ‌న్ జోడి ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీ ఫైనల్స్‌కు చేరుకున్నారు. అలాగే పురుషుల డబుల్స్‌లో రోహన్ బొప‌న్న‌-మ్యాట్ ఎబ్డెన్‌లు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నారు. రోహన్ బొప‌న్న‌పురుషుల డబుల్స్ టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నంబర్ 1 గా నిలిచిన అత్యంత వయోవృద్ధ ఆటగాడిగా నిలిచాడు.

Also Read: Picture Of BCCI: స్టైలిష్‌ లుక్‌లో టీమిండియా ఆట‌గాళ్లు.. మిస్సైన విరాట్ కోహ్లీ..!

అంతకుముందు రోహన్ బొప‌న్న‌- అతని పార్ట‌న‌ర్‌ ఆస్ట్రేలియాకు చెందిన మాట్ ఎబ్డెన్ నెదర్లాండ్స్‌కు చెందిన వెస్లీ కూల్‌హాఫ్- క్రొయేషియాకు చెందిన నికోలా మెక్టిక్ జోడీని వరుస సెట్లలో ఓడించారు. రెండో సీడ్‌లో ఉన్న భారత్‌-ఆస్ట్రేలియా జోడీ ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ జోడీ కూల్‌హాఫ్‌, మెక్టిక్‌పై 7-6 7-6 తేడాతో విజయం సాధించింది. ఇప్పుడు క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో రోహన్ బొప‌న్న‌-మాట్ ఎబ్డెన్ ద్వయం 6-4, 7-6 (7-5)తో అర్జెంటీనాకు చెందిన మాక్సిమో గొంజాలెజ్-ఆండ్రెస్ మోల్టెని జోడీని ఓడించింది.

We’re now on WhatsApp. Click to Join.

బొప‌న్న‌ తన మొదటి పురుషుల డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిల్‌పై దృష్టి సారించాడు. ఎబ్డెన్‌తో అతని భాగస్వామ్యం అద్భుతమైనది. బొప‌న్న‌ తొలిసారిగా ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరుకున్నాడు. బొప‌న్న‌ 2008లో తొలిసారి పురుషుల డబుల్స్‌లోకి ప్రవేశించాడు. కానీ అతను మూడో రౌండ్‌కు మించి ముందుకు సాగలేకపోయాడు.