Site icon HashtagU Telugu

Long Overdue: 81 ఏళ్ళ తర్వాత లైబ్రరీకి చేరుకున్న పుస్తకం.. చివరికి ఏం జరిగిందంటే?

Long Overdue

Long Overdue

మామూలుగా చాలామంది లైబ్రరీలకు వెళ్తూ ఉంటారు. అయితే కొందరు లైబ్రరీలో ఉండి అక్కడ పుస్తకాలను చదివితే మరికొందరు మాత్రం వాటిని ఇంటికి తీసుకొని వెళ్లి చదువుకొని ఆ తర్వాత మళ్లీ వారిని రిటర్న్ చేస్తూ ఉంటారు. అయితే అలా ఇంటికి తీసుకుని వెళ్లి పుస్తకాలను రిటర్న్ చేయడానికి కొంత సమయం మాత్రమే గడువు ఉంటుంది. గడువులోపు ఆ పుస్తకాలను రిటర్న్ చేయకపోతే వెంటనే ఫైన్ విధిస్తూ ఉంటారు. చాలామంది మరిచిపోయి అలాగే ఇతర పనుల కారణంగా తీసుకెళ్లిన పుస్తకాలను తిరిగి మళ్ళీ లైబ్రరీలో అప్పగించడం మర్చిపోతూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక వ్యక్తి పుస్తకాన్ని తిరిగి ఇచ్చేందుకు లైబ్రరీకి వచ్చాడు. ఆ పుస్తకాన్ని చూసిన అక్కడ స్టాఫ్‌ ఆశ్చర్యపోయారు. ఈ పుస్తకం 1942, మార్చి 30 నాడు ఇష్యూ చేసినది. అంటే ఈ పుస్తకం 81 ఏళ్ల తరువాత తిరిగి లైబ్రరీకి చేరింది. ఈ ఘటన అమెరికా లోని వాషింగ్టన్‌లో గల ఎబర్డీన్‌లో చోటు చేసుకుంది. పాత సామానులలో దొరికింది
లైబ్రరీ ప్రతినిధులు తమ ఫేస్‌బుక్‌ పేజీలో ఈ విషయాన్ని తెలియజేస్తూ, చార్ల్స్‌ నార్డాఫ్‌ అండ్‌ జేమ్స్‌ నార్మన్‌ హాల్‌ రాసిన పుస్తకం ‘ది బౌంటీ ట్రిలాజీ 81 ఏళ్ల తరువాత ఎబర్డీన్‌ టింబర్లాండ్‌ లైబ్రరీకి తిరిగి వచ్చింది.

ఈ పుస్తకం పాత సామానుల మధ్య పడి ఉండగా లభ్యమయ్యిందని తెలిపారు.. కిరో7 న్యూస్‌ రిపోర్టు ప్రకారం ఈ పుస్తకాన్ని లైబ్రరీ నుంచి తీసుకున్న వ్యక్తి ఈ పుస్తకంలోని 17వ పేజీ వరకే చదివాడు. అతను పుస్తకంలో ఇలా ఒక నోట్‌ రాశాడు..ఒకవేళ నాకు డబ్బులు ఇచ్చిన పక్షంలో నేను ఈ పుస్తకాన్ని ఎప్పటికీ చదవను అని రాసివుంది. అంటే అ వ్యక్తికి ఈ పుస్తకం చదవడం అస్సలు ఇష్టం లేదని తెలుస్తోంది. లైబ్రరీ అధికారులను ఈ పుస్తకానికి ఒకవేళ లేటు ఫీజు విధిస్తే ఎంత ఉంటుందని అడగగా, సెలవురోజులు మినహాయించి మిగిలిన రోజులను పరిగణలోకి తీసుకుంటే రోజుకు రెండు సెంట్ల చొప్పున 1942 నాటి విలువను అనుసరించి ఇది 484 డాలర్ లు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా సుమారు రూ.40 వేలు అవుతుంది. అయితే లైబ్రరీ నిర్వాహకుల కోవిడ్‌-19 మహమ్మారి నేపధ్యంలో లేటు ఫీజు అనేది పూర్తి స్థాయిలో ఎత్తివేశారు.