Bonalu 2023: తెలంగాణాలో బోనాల జాతర మొదలైంది. బోనాలకు హైదరాబాద్ పెట్టింది పేరు. ప్రతి ఏడాది హైదరాబాద్ బోనాలను ఘనంగా జరుపుకుంటారు. ప్రభుత్వం కూడా బోనాలను అత్యంత వైభవంగా జరుపుతుంది.
హైద్రాబాద్లో నిన్న ఆదివారం బోనాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ విశిష్ట సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలను పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని జగదాంబిక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల ఊరేగింపులు కోట వద్దకు చేరుకున్నాయి. ఇక బోనాలు అంటే శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తద్వారా కోట వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ నగరంలో మూడు దశల్లో బోనాలు నిర్వహిస్తారు. గోల్కొండ బోనాలు అనంతరం సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో లష్కర్ బోనాలు నిర్వహిస్తారు. లాల్ దర్వాజాలోని శ్రీ సింహవాహిని మహంకాళి ఆలయంలో, హైదరాబాద్ పాతబస్తీలోని హరిబౌలిలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి ఆలయంలో ఉత్సవాలు వచ్చే నెలలో ముగుస్తాయి.
Read More: Opposition Meet Postponed : విపక్షాల మీటింగ్ వాయిదా.. పార్లమెంటు సమావేశాల తర్వాతే భేటీ