బోనాల పండుగ.. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఆషాడ మాసం బోనాలను జరుపుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు వివిధ దేశాల్లో స్థిరపడిన వారు కూడా ఆ ప్రదేశాలలో బోనాల పండుగను జరుపుకుంటున్నారు. తాజాగా
సింగపూర్ లో కూడా తెలుగు సమాజం ఆధ్వర్యంలో బోనాల పండుగని శ్రీ అరసకేసరి శివన్ ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తిగీతాలు, అత్యద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలు, డప్పు వాయిద్యాల నడుమ, అమ్మవారి నామస్మరణలతో కార్యక్రమం హోరెత్తింది.
పలువురు మహిళలు కుటుంబ సభ్యులతో భక్తి శ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనం ఆ జగన్మాతకు ఆషాడ మాసంలో సమర్పించే నైవేద్యం. అరకేసరి దేవాలయంలో మహిళలు బోనాలు సమర్పించారు. డప్పు వాయిద్యాలు, పోతురాజు ప్రదర్శన ఆకర్షణగా నిలిచింది. పలువురు తెలుగు వాళ్లు ఆ వేడుకలో పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షులు బొమ్మారెడ్డి శ్రీనివాసులు రెడ్డి అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేశారు. బోనాలు పండగ మన తెలుగు వారి గొప్ప సాంప్రదాయక పండుగ దీన్ని ప్రతీ సంవత్సరం జరపాలని తమ కార్యవర్గం నిర్ణయించినట్లు తెలిపారు.
Bonalu
బోనాలు సమర్పించిన మహిళల్ని, కార్యక్రమ నిర్వాహకులను ఆయన అభినందించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కేవలం సింగపూర్ లో మాత్రమే కాకుండా వివిధ దేశాలలో స్థిరపడిన తెలంగాణ ప్రజలు అక్కడ ఈ ఆషాడ బోనాల పండుగను జరుపుకుంటున్నారు.