Site icon HashtagU Telugu

Mumbai : వామ్మో ఎకరం భూమి రూ.277 కోట్లా..?

Bombay Dyeing mill land in Worli to be sold

Bombay Dyeing mill land in Worli to be sold

మొన్నటికి మొన్న హైదరాబాద్ కోకాపేట (Hyderabad Kokapet)లో ఎకరం భూమి (Kokapet Land Price) రూ.100 కోట్లకుపైగా ధర పలకడం తో దేశం మొత్తం మాట్లాడుకున్నారు. వామ్మో ఎకరం భూమి వంద కోట్లా..? అంటూ నోరు వెళ్ళబెట్టారు. ఈ ధర తో హైదరాబాద్ (Hyderabad) రేంజ్ ఏంటో అందరికి అర్థమైంది. కానీ ఇప్పుడు కోకాపేట కాదు మరో పేటను సైతం తలదన్నే విధంగా ఎకరం భూమి రూ. 277 కోట్లు పలకడం ఇప్పుడు అందర్నీ మరింత షాక్ కు గురి చేస్తుంది. ఇది ఎక్కడో అనుకుంటున్నారా..? దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై (Mumbai ) నగరంలో ఈ ధర పలికింది.

ప్రపంచంలోకెల్లా ఖరీదైన నగరాల్లో ముంబై ఒకటి. ముంబై నగరంలో భూముల విలువ దేశంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఎక్కువ. ఎంత అంటే.. ముంబై నగరంలోని బాంబే డైయింగ్ మిల్లు (Bombay Dyeing’s mill land)కు చెందిన 15 ఎకరాల భూమిని జపాన్‌కు చెందిన సమిటోమో (Japanese conglomerate Sumitomo ) అనే సంస్థ దాదాపు రూ.5 వేల కోట్లకు కొనుగోలు చేయబోతుందట. అంటే ఎకరం భూమి ధర రూ.277 కోట్లకు పైమాటే పలుకుతుంది. వొర్లీలోని బుధ్కర్ మార్గ్‌ (Pandurang Budhkar Marg) లో ఈ భూమి ఉంది.

Read Also : Chandrababu – KCR : కేసీఆర్ ను ఆకాశానికి ఎత్తేసిన చంద్రబాబు

వొర్లీలోని లక్ష చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమికి సంబంధించి లీగల్ వివాదాలు లేవని నిర్ధారించుకోవడం కోసం వాడియా చాందీ అనే లా ఫర్మ్ తన క్లయింట్ తరఫున ఈ వారం ఆరంభంలో పబ్లిక్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రాపర్టీని అమ్మనున్న నేపథ్యంలో వాడియా గ్రూప్ హెడ్‌క్వార్టర్స్ అయిన వాడియా ఇంటర్నేషనల్ సెంటర్ భవంతిని ఖాళీ చేస్తున్నారు. చైర్మన్ ఆఫీసును దాదర్-నైగౌన్‌లోని బాంబే డైయింగ్ ప్రాపర్టీకి షిఫ్ట్ చేస్తున్నారు. వాడియా హెడ్ క్వార్టర్స్‌తోపాటు నటి శిల్పాశెట్టికి చెందిన బాస్టియన్ రెస్టారెంట్‌ సైతం మూతపడింది. దీంతో నుస్లీ వాడియా నియంత్రణలో ఉన్న హాట్ ప్రాపర్టీ విషయం రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.