Site icon HashtagU Telugu

Bomb Threat: బ్రేకింగ్.. ఢిల్లీ ఇండియన్ పబ్లిక్ స్కూలుకు బాంబు బెదిరింపు

China Explosion

Bomb blast

దేశంలో బాంబు బెదిరింపుల ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. గతంలో కర్ణాటకలోని పలు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో బెదిరింపు వచ్చింది. ఢిల్లీలోని ఇండియన్ పబ్లిక్ స్కూల్‌లో బాంబుకు సంబంధించి ఇమెయిల్ వచ్చింది. వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌ను చేరుకొని తనిఖీ చేస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయ్యింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన వ్యక్తం చేశారు.