శంషాబాద్ ఎయిర్ పోర్టు (Shamshabad Airport) కు బాంబు బెదిరింపు మెయిల్ (Bomb Threat Mail)..ప్రయాణికులను , అధికారులను , విమాన సిబ్బందిని పరుగులు పెట్టించింది. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు గుర్తుతెలియని వ్యక్తి మెయిల్ చేసాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎయిర్ పోర్ట్ భద్రత తనిఖీలు చేపట్టారు. ఎక్కడిక్కడే ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం..బాంబు స్క్వాడ్ లు విమానాలను చెక్ చేయడం..అనుమానితులను విచారించడం ఇలా అన్ని చేస్తూ వచ్చారు.
ఇదిలా ఉండగా బెదిరింపు మెయిల్ వచ్చిన కొద్దిసేపటికే తన కుమారుడి మానసిక పరిస్థితి బాగా లేదని క్షమించాలని మరో మెయిల్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చింది. ఈ రెండు మెయిల్స్ కూడా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుండి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ రెండు మెయిళ్లపై అధికారులు విచారిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఎలాంటి బాంబు లేదని భద్రతా సిబ్బంది తేల్చి చెప్పడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు.
Read Also : China New Map Vs India : అరుణాచల్, ఆక్సాయ్ చిన్ చైనావేనట.. డ్రాగన్ ‘కొత్త మ్యాప్’ పై దుమారం !
ఐదు రోజుల క్రితం ముంబైలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానంలో ఇలాగే బాంబు కాల్ అందర్నీ టెన్షన్ పెట్టించింది. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Chhatrapati Shivaji Maharaj International Airport) లోని ఒక విమానంలో బాంబు ఉందని ముంబై పోలీసు ప్రధాన కంట్రోల్ రూమ్ అధికారులు కాల్ అందుకున్నారు. ప్రమాదం జరగకుండా ఆపడానికి బాలుడు పోలీసులు సాయం కూడా కోరాడని వివరించారు. దీంతో వెంటనే తనిఖీలు చేపట్టి బాంబు లేదని తేల్చారు. అయితే పోలీసులు ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేశారు. సతారా జిల్లా నుంచి 10 ఏళ్ల బాలుడు కాల్ చేసినట్లు గుర్తించారు. సదరు బాలుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసులకు తెలిసింది. ప్రస్తుతం బాలుడు ఓ వ్యాధికి చికిత్సు తీసుకుంటున్నారని పోలీసులు చెప్పారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ గత ఆదివారం ముంబై విమానాశ్రయం నుంచి పోలీసులకు బూటకపు కాల్స్ చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడిని రుక్సార్ ముక్తార్ అహ్మద్‌గా గుర్తించారు.