Bomb Threat Call: స్పైస్ జెట్ విమానానికి బాంబు బెదిరింపు కాల్.. ఫ్లైట్ అత్య‌వ‌స‌ర ల్యాండింగ్‌..!

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫోన్ కాల్ (Bomb Threat Call) కలకలం సృష్టించింది. ఈ కాల్ స్పైస్ జెట్ విమానాన్ని బాంబుతో పేల్చేస్తామ‌ని ఓ గుర్తుతెలియ‌ని వ్య‌క్తి ఫోన్ చేసి అధికారుల‌ను బెదిరించాడు.

  • Written By:
  • Updated On - January 25, 2024 / 08:50 AM IST

Bomb Threat Call: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఫోన్ కాల్ (Bomb Threat Call) కలకలం సృష్టించింది. ఈ కాల్ స్పైస్ జెట్ విమానాన్ని బాంబుతో పేల్చేస్తామ‌ని ఓ గుర్తుతెలియ‌ని వ్య‌క్తి ఫోన్ చేసి అధికారుల‌ను బెదిరించాడు. దర్భంగా నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్పైస్‌జెట్‌ విమానంలో ఈ ఘ‌ట‌న చేస్తామ‌ని ఆ వ్యక్తి బెదిరించాడు. సీనియర్ విమానాశ్రయ భద్రతా అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. దర్భంగా నుండి బయలుదేరిన స్పైస్ జెట్ ఫ్లైట్ SG-8496.. IGI విమానాశ్రయంలో దిగడానికి సిద్ధంగా ఉంది. ఇంతలో ఐజీఐ ఎయిర్‌పోర్ట్ కంట్రోల్ రూమ్‌కి ఎవరో ఫోన్ చేసి ఫ్లైట్‌పై బాంబు ఉంద‌ని, దాని పేలుస్తామ‌ని బెదిరించారు. కాల్ అందుకున్న ఆపరేటర్ వెంటనే ఈ విషయమై ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC), ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్ కంట్రోల్ సెంటర్ (AOCC)కి సమాచారం అందించాడు.

ఆ తర్వాత ATC.. విమానాన్ని గో-రౌండ్‌కి వెళ్లమని ఆదేశించింది. అన్ని సంబంధిత ఏజెన్సీలను ఎయిర్ సైట్‌లో అవసరమైన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరింది. వెంటనే సీనియర్‌ అధికారుల నేతృత్వంలో సీఐఎస్‌ఎఫ్‌ క్యూఆర్‌టీ, కమాండో స్క్వాడ్‌, బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌, అంబులెన్స్‌, ఫైర్‌ బ్రిగేడ్‌ వాహనాలను రప్పించారు. ఎయిర్‌సైట్‌లో అన్ని చర్యలను పూర్తి చేసిన తర్వాత విమానం అత్యవసర ల్యాండింగ్ చేయబడింది.

Also Read: MLC Kavitha: ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్? పోలీసులు బేషరతుగా క్షమాపణ చెప్పాలి

ల్యాండింగ్ తర్వాత CISF QRT పర్యవేక్షణలో విమానాన్ని ఏకాంత మార్గంలోకి తీసుకెళ్లారు. ముందుగా ప్రయాణికులను విమానం నుంచి బయటకు తీశారు. ఆ తర్వాత విమానంలో ఉన్న మొత్తం లగేజీని స్కాన్ చేశారు. విచారణలో అంతా బాగానే ఉందని, ఆ తర్వాత బెదిరింపు కాల్‌ను బూటకపు కాల్‌గా ప్రకటించారు. ఈ కేసులో పోలీసులు కేసు నమోదు చేసి కాల్ చేసిన వ్యక్తి కోసం వెతుకులాట ప్రారంభించారు. ప్రస్తుతం ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాజధానిలో బెదిరింపు ఫోన్‌ కాల్స్‌తో పోలీసులు నిఘా పెంచారు.

We’re now on WhatsApp. Click to Join.