Site icon HashtagU Telugu

Bihar CM:బీహార్ సీఎం ‘జనసభ’ ద‌గ్గ‌ర పేలుడు.. ఒక వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Nitish Imresizer

Nitish Imresizer

నలందలోని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ‘జనసభ’ సైట్‌లో ఓ వ్యక్తి బాణసంచా పేల్చాడు. జనసభలో ప్రసంగించేందుకు నితీష్ కుమార్ సిలావ్ చేరుకున్నారు. అక్కడ సమావేశ స్థలంలో ఒక వ్యక్తి పటాకుల లోపలకు తీసుకు వ‌చ్చి పేల్చడంతో తొక్కిసలాట జరిగింది. అయితే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణకు తరలించారు. నితీశ్‌ కుమార్‌ కూర్చున్న స్టేజీకి 15-18 అడుగుల దూరంలోనే క్రాకర్‌ పేలింది. ఈ ఘ‌ట‌న‌లో ఎవ‌రికి ఎలాంటి గాయాలు కాక‌పోవ‌డంతో అంద‌రు ఊపిరి పీల్చుకున్నారు.

జన్ సంవద్ యాత్ర కోసం బీహార్ సీఎం నలంద పర్యటనలో ఉన్నారు. మంగళవారం (ఏప్రిల్ 12) పావాపురిలోని వర్ధమాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నితీష్ కుమార్ నానంద్ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ గ్రామస్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. టీవల భక్తియార్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో కూడా సీఎం నితీశ్ కుమార్‌కు భ‌ద్ర‌త‌లోపం జ‌రిగింది.