Site icon HashtagU Telugu

Atiq Murder Case: అతిక్ తరుపు లాయర్ ఇంటి ఆవరణలో బాంబు పేలుళ్లు

atiq ahmed

New Web Story Copy (7)

Atiq Murder Case: ప్రయాగ్‌రాజ్‌లో అతిక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అష్రఫ్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే తాజాగా మరో వార్త హాట్ టాపిక్ గా మారింది. అతిక్ అహ్మద్‌ తరపు న్యాయవాది దయాశంకర్‌ మిశ్రా ఇంటి బయట బాంబు దాడి జరిగిందని బయటపడింది. వాస్తవానికి ప్రయాగ్‌రాజ్‌లోని కత్రాలోని గోబర్ గలీలో అతిక్ అహ్మద్ న్యాయవాది దయాశంకర్ మిశ్రా ఇంటి వెలుపల మంగళవారం మధ్యాహ్నం బాంబు పేలుళ్లు జరిగాయి. ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు లాయర్ ఇంటి బయట మూడు బాంబులు విసరడంతో పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. ఆ సమయంలో ఇంట్లో న్యాయవాది దయాశంకర్‌ లేరు.బాంబు దాడిలో ఇంటికి ఎటువంటి నష్టం జరగలేదు మరియు ఎవరూ గాయపడలేదు. అయితే స్థానికంగా గందరగోళం నెలకొంది. బాంబు పేలుడు కారణంగా పొగలు వ్యాపించాయి. బాంబు పేలుళ్లు రోడ్డుపై, అడ్వకేట్ దయాశంకర్ ఇంటి లోపల చెల్లాచెదురుగా పడ్డాయి.

దయాశంకర్ ఇంటి ప్రాంతంలో ఛోటూ యాదవ్ నివసిస్తాడు. బాంబు దాడి ఘటనపై దర్యాప్తు చేయగా.. డబ్బు లావాదేవీల విషయంలో హర్షిత్‌ సోంకర్‌కు చోటు యాదవ్‌తో వివాదం ఉన్నట్లు తేలింది. డబ్బు వివాదంలో హర్షిత్ సోంకర్ ఛోటూ యాదవ్ ఇంటి వద్ద గొడవపడి బాంబులు విసురుతూ పారిపోయాడు. దురదృష్టవశాత్తు అతిక్ అహ్మద్ తరపు న్యాయవాది దయాశంకర్ మిశ్రా ఇంటి బయట బాంబులు పేలాయి.

కాగా అతిక్ అహ్మద్ మరియు అష్రఫ్ హత్య తర్వాత ఈ బాంబు పేలుడు ఘటన పోలీసులకు శాంతిభద్రతల సవాలుగా మారింది. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఫోరెన్సిక్ బృందాన్ని పిలిపించి బాంబు అవశేషాలను స్వాధీనం చేసుకున్నారు. సమీపంలోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు.

Read More: Karnataka 2023: క‌ర్ణాట‌క ఎన్నిక‌ల‌పై లోక్ పాల్ లేటెస్ట్ స‌ర్వే