Tunisha Sharma Suicide : తునీషా శర్మ ఆత్మహత్య!

తునీషా ఆత్మహత్యకు (Suicide) గల కారణాలు తెలియరాలేదు.

Published By: HashtagU Telugu Desk
Tunisha Sharma Committed Suicide

Tunisha Sharma Committed Suicide

బాలీవుడ్ (Bollywood) యువ నటి తునీషా శర్మ (Tunisha Sharma) ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వయసు 20 సంవత్సరాలు. తునీషా (Tunisha Sharma) ఆత్మహత్యకు (Suicide) గల కారణాలు తెలియరాలేదు. ఓ సీరియల్ షూటింగులో ఉన్న తునీషా సెట్స్‌లోనే ఆత్మహత్యకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన యూనిట్ సిబ్బంది ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

బాలీవుడ్ (Bollywood) మీడియా చెబుతున్న దాని ప్రకారం.. సహనటుడైన సీజన్ మహ్మద్ మేకప్ రూములో తునీషా ఆత్మహత్య చేసుకున్నారు. విరామం తర్వాత తిరిగి తన రూముకు వచ్చిన సీజన్ తన గది లాక్ చేసి ఉండడంతో తలుపు తెరవాలంటూ గట్టిగా పిలిచారు. తలుపును గట్టిగా తట్టారు. అయినా ఫలితం లేకపోవడంతో డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలో పడి ఉన్న తునీషాను ఆసుపత్రికి తరలించారు. తునీషా మరణ వార్త బాలీవుడ్‌ను విషాదంలోకి నెట్టేసింది. ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తునీషా చేసిన చివరి పోస్టును షేర్ చేస్తూ సంతాపం తెలుపుతున్నారు. కాగా, వచ్చే నెల 14న ఆమె తన 21వ బర్త్‌డేను జరుపుకోన్నారు. ఈలోగానే ఆమె ఆత్మహత్య చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.

‘భారత్ కా వీర్ పుత్ర’ సీరియల్‌తో 13 ఏళ్లకే నటిగా మారిన తునీషా.. ఆ తర్వాత ‘చక్రవర్తి అశోక సామ్రాట్’, ‘గబ్బర్ పూన్చావాలా’, ‘ఇంటర్నెట్ వాలా లవ్’, ‘హీరో: గాయబ్ మోడ్ ఆన్’ వంటి సీరియళ్లలో నటించారు. ఆ తర్వాత ‘ఫితూర్ సినిమాలో కత్రినా కైఫ్ చిన్నప్పటి పాత్రను పోషించారు. అలాగే, ‘బార్ బార్ దేఖో’, ‘కహానీ 2’, ‘దబాంగ్ 3’ సినిమాల్లోనూ నటించారు.

Also Read:  Sonia and Rahul: ఢిల్లీకి భారత్ జోడో యాత్ర.. సోనియా, రాహుల్ భావోద్వేగం!

  Last Updated: 25 Dec 2022, 02:55 AM IST