Site icon HashtagU Telugu

Bipasha Basu Pregnancy: తల్లికాబోతున్న బిపాసా.. బేబీ బంప్ ఫొటోలు వైరల్

Bipasa

Bipasa

బాలీవుడ్ బ్యూటీ బిపాసా బసు గర్భం దాల్చినట్టు చాలా రోజులుగా వార్తొలొస్తున్నాయి. కానీ బిపాసా, కరణ్ సింగ్ ఆ విషయం గురించి క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఈ జంట అధికారిక ప్రకటన చేశారు. ప్రెగ్నెన్సీ షూట్ తో ఫొజులిచ్చిన ఫొటోలను పోస్ట్ చేశారు. ఈ జంట వైట్ అండ్ వైట్ బట్టలు ధరించి కనిపించారు. మొదటి ఫోటోలో కరణ్ బిపాసా బేబీ బంప్‌ను టచ్ చేస్తుండగా,  రెండో ఫోటోలో ముద్దు పెట్టుకోవడం చూడొచ్చు. ప్రగ్నెన్నీ గురించి చెబుతూ సోషల్ మీడియాలో అద్భతమైన పోస్ట్ పెట్టారు.

“ఒక కొత్త సమయం, ఒక కొత్త దశ, కొత్త కాంతి. మేం ఈ జీవితాన్ని వ్యక్తిగతంగా ప్రారంభించాం. కానీ ఆ తర్వాత మేం ఒకరినొకరు కలుసుకున్నాం. ఎప్పుడైతై కలిశామో.. అప్పట్నుంచే ఇద్దరమే. ఒప్పుడు ఇద్దరుగా ఉన్న మేం ఇప్పుడు ముగ్గురం కాబోతున్నాం. మన ప్రేమ ద్వారా వ్యక్తమైన సృష్టి, మా పాప మనతో కలిసిపోతుంది. మీ షరతులు లేని ప్రేమ, మీ ప్రార్థనలు, శుభాకాంక్షలకు ధన్యవాదాలు‘‘ అంటూ అందంగా క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం బిపాస బేబీ బంప్ ఫొటోలు వైరల్ గా మారాయి.