Site icon HashtagU Telugu

Body shaming: సురేశ్ గోపి కూతురిపై బాడీ షేమింగ్ .. చీరలు వద్దంటూ కామెంట్స్

Body Shaming

Body Shaming

ప్రముఖ మలయాళీ నటుడు సురేశ్ గోపి కూతురు భాగ్య బాడీ (Body shaming) షేమింగ్ కు గురయ్యారు. ఇటీవల ఆమె కెనడాలోని ఒక కాలేజీ నుంచి భాగ్య గ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ పిక్స్ పై ఒక నెటిజన్ స్పందిస్తూ… ఇకపై మీరు చీరలను పక్కన పెట్టి వెస్టర్న్ దుస్తులు వేసుకుంటే బాగుంటుందని కామెంట్ చేశాడు.

లావుగా ఉన్నవాళ్లకు చీరలు పెద్దగా సెట్ కావని, వెస్టర్న్ దుస్తుల్లో మీరు అందంగా ఉంటారని సూచించాడు. ఈ వ్యాఖ్యలపై భాగ్య స్పందిస్తూ… మీ ఉచిత సలహాలకు ధన్యవాదాలు అని రిప్లై ఇచ్చింది. తన బరువు ఇతరుల సమస్య కాదని… కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Also Read: NTR31: ప్రియాంక చోప్రాతో ఎన్టీఆర్ రొమాన్స్, ఆసక్తి రేపుతున్న NTR31 మూవీ