Site icon HashtagU Telugu

Heavy Rain Hyd : మూసారాంబాగ్‌ బ్రిడ్జి దగ్గరకు కొట్టుకువచ్చిన మహిళ మృతదేహం

Laxmi Body In Musi River

Laxmi Body In Musi River

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad) లో రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడం తో చాలామంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. ఇదే క్రమంలో పలువురు నాలాలో పడి మృతి చెందుతున్నారు. నిన్న నాలుగేళ్ళ బాలుడు నాలాలో పడి మృతి చెందగా..తాజాగా మూసారాంబాగ్‌ బ్రిడ్జి దగ్గరకు మహిళ మృతదేహం కొట్టుకవచ్చింది.

4 రోజుల క్రితం హుస్సేన్‌సాగర్‌ నాలా (Hussain Sagar Nala)లో లక్ష్మీ (Laxmi) అనే మహిళ గల్లంతైంది. అప్పటి నుండి కుటుంబ సభ్యులు , పోలీసులు లక్ష్మి కోసం వెతుకుతూనే ఉన్నారు. అయితే..ఈరోజు ఉదయం మూసారాంబాగ్‌ బ్రిడ్జి దగ్గర మూసీ (Musi)లో లక్ష్మీ మృతదేహం కొట్టుకువచ్చింది. తన తల్లి మృతదేహాన్ని గుర్తించిన (Lakshmi’s daughter identified the dead body) లక్ష్మీ కూతురు… బోరున విలపించింది. మా అమ్మ మాకు దూరం అయిందని.. ఎడమ చేతిపై తన స్నేహితురాలి పచ్చబొట్టు పేరు కమలమ్మ అని రాయించుకుందని వెల్లడిచింది లక్ష్మీ కూతురు. ముక్కుపుల్ల మరియు పచ్చబొట్టు దాని ఆధారంగా మా అమ్మ మృతదేహం గా గుర్తుచానని తెలిపింది. తన తల్లి లక్ష్మి మృతదేహం కోసం నాలుగు రోజులు వేతికామని… అధికారులు తీవ్రంగా శ్రమించారని పేర్కొంది. ఈ రోజు మా అమ్మ మాకు లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Read Also : Telangana : బిఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతుందా..? కీలక నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారా..?

మరో ఐదు రోజులపాటు వర్షాలు పడతాయని, ముఖ్యంగా గురువారం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలుపడం తో అధికారులను మరింత అప్రమత్తం చేసింది ప్రభుత్వం. వాయవ్య బంగాళాఖాతం దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ కోస్తా తీరాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టానికి 7.6 కి.మీ వరకు వ్యాపించి ఎత్తుకు వెళ్లే కొద్ది నైరుతి వైపు వాలింది. ఈ అల్పపీడనం 24 గంటల్లో పశ్చిమ దిశగా ఛత్తీస్‌గడ్‌ మీదుగా కదిలే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని ప్రకటించింది. అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా, దక్షిణ ఛత్తీస్‌గఢ్‌ మీదుగా పయనిస్తుందని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్రతోపాటు తెలంగాణలో 8వ తేదీ వరకు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇక నల్లగొండ జిల్లా కేతేపల్లి మండల పరిధిలోని మూసీ ప్రాజెక్టు (Musi Project)కు వరద ఉధృతి కొన‌సాగుతూనే ఉంది. దీంతో ప్రాజెక్టు 5 గేట్ల ఎత్తి దిగువ‌కు నీటిని విడుద‌ల చేస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 3680.20 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 643.40 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమ‌ట్టం 645 అడుగులు. ప్రాజెక్టు ప్ర‌స్తుత నీటి నిల్వ 4.04 టీఎంసీలు కాగా, పూర్తిస్థాయి నీటినిల్వ 4.46 టీఎంసీలు.