Telangana Rains: తెలంగాణలో కుండపోత వర్షం కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అవసరం అయితేనే బయటకు రావాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. మరోవైపు తెలంగాణ అధికార యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. పొంగిపొర్లుతున్న వాగుల వద్ద డేంజర్ జోన్లుగా ప్రకటించారు. ఐఎండీ తెలంగాణకు ఇప్పటికే రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అయినప్పటికీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చెరువులు, నీటిపారుదల ప్రాజెక్టులు పొంగిపొర్లడంతో వరంగల్, హనుమకొండ, ఖమ్మం పట్టణాల్లోని 100కు పైగా గ్రామాలు, పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గురువారం అదృశ్యమైన వరంగల్ పట్టణానికి చెందిన ముగ్గురు యువకుల కోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం వెతుకుతోంది. చేపల వేటకు వెళ్లిన ఆ యువకులు మళ్ళీ తిరిగిరాలేదు. దీంతో ఎన్‌డిఆర్‌ఎఫ్ ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టింది. కాగా వరదల్లో కొట్టుకుపోయిన ఐదుగురి మృతదేహాలు శుక్రవారం లభ్యమవగా, మరో ఎనిమిది మంది కోసం గాలిస్తున్నారు. అలాగే ఖమ్మం జిల్లా మున్నేరు నదిలో చిక్కుకుపోయిన ఏడుగురిని ఎన్డీఆర్ఎఫ్ రక్షించింది. మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Also Read: AP CM : పవన్ కళ్యాణ్ ను ఏపీ సీఎం ను చేసిన హీరోయిన్..