Hyderabad: మాజీ ఎమ్మెల్యే కొడుకు పారిపోవడానికి సహకరించిన బోధన్ సీఐ అరెస్ట్

హైదరాబాద్ లో జరిగిన ఓ కారు ప్రమాదంలో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే అమీర్‌ షకీల్‌ కుమారుడు రహీల్‌ అలియాస్‌ సోహైల్‌ ప్రధాన నిందితుడు. కారు ప్రమాదం అనంతరం సోహైల్‌ పరారయ్యాడు.

Hyderabad: హైదరాబాద్ లో జరిగిన ఓ కారు ప్రమాదంలో బోధన్‌ మాజీ ఎమ్మెల్యే అమీర్‌ షకీల్‌ కుమారుడు రహీల్‌ అలియాస్‌ సోహైల్‌ ప్రధాన నిందితుడు. కారు ప్రమాదం అనంతరం సోహైల్‌ పరారయ్యాడు. కొద్దీ రోజులకే దేశం విడిచి దుబాయ్ చెక్కేశాడు. పైగా రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో కుమారుడి అరెస్ట్ తప్పదని భావించిన షకీల్ కుమారుడిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా దుబాయ్ పంపించేశాడు. అయితే అతను దుబాయ్‌ పారిపోవడానికి సహకరించిన ఆరోపణలపై బోధన్‌ పోలీస్‌ స్టేషన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌కుమార్‌తో పాటు మరో వ్యక్తిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు.

డిసెంబర్ 24 తెల్లవారుజామున రహీల్ మద్యం మత్తులో తన కారును పోలీసు బారికేడ్‌పైకి ఢీకొట్టాడు. ఈ కేసులో రహీల్‌కు బదులు మరొకరిని నిందితులుగా చేర్చారు. ఘటన వెలుగులోకి రావడంతో సమగ్ర విచారణ చేపట్టారు. తద్వారా సీసీ రికార్డుల్లో షకీల్‌ కుమారుడు రహీల్‌ ప్రధాన నిందితుడిగా తేలింది.

విచారణలో రహీల్ దుబాయ్ పారిపోయినట్లు వెలుగులోకి వచ్చింది. రహీల్ దుబాయ్ పారిపోవడానికి సహకరించిన వ్యక్తులందరినీ పోలీసులు గుర్తించడం ప్రారంభించారు మరియు నలుగురిని అరెస్టు చేశారు. ఈ కేసులో బోధన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ప్రేమ్ కుమార్‌తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: Naga Chaitanya: నాగ చైతన్య తండేల్ రిలీజ్ తేదీ ఎప్పడు?