NASA: చంద్రుడిపై వ్యోమగాముల మూన్ వాక్.. కాలుజారి కిందపడిన వీడియో వైరల్

"చందమామ రావె.. జాబిల్లి రావె.. కొండెక్కి రావె.. జాజిపూలు తేవె" అని పాటలు పాడుకున్న

  • Written By:
  • Updated On - June 11, 2022 / 12:36 PM IST

“చందమామ రావె.. జాబిల్లి రావె.. కొండెక్కి రావె.. జాజిపూలు తేవె” అని పాటలు పాడుకున్న మనిషి అందాల చందమామపై అడుగు మోపిన క్షణాలు ఉద్విగ్న భరితమైనవి. 1972వ సంవత్సరం లో అపోలో-17 మిషన్ ద్వారా అమెరికా కు చెందిన నాసా సంస్థ ఇద్దరు శాస్త్రవేత్తలు చంద్రుడిపై ల్యాండ్ అయ్యారు. వాళ్ళు అక్కడ అమెరికా జెండాను పాతి, దానికి సెల్యూట్ చేసే ఫోటోలనే ఇప్పటిదాకా చూశాం. కానీ చంద్రుడి పై వ్యోమగాములు సూట్ లో బుడి బుడి అడుగులు వేసే క్రమంలో.. కిందపడే వీడియో క్లిప్ ఒకటి ఇప్పుడు ట్విట్టర్ లో వైరల్ అవుతోంది. ఇప్పటివరకు దీనికి 4.93 లక్షల వ్యూస్ రావడం విశేషం. konstructivizm అనే ట్విట్టర్ ఖాతా ఈ వీడియో క్లిప్ ను షేర్ చేసింది. “చంద్రుడి పై నడిచే క్రమంలో వ్యోమగామి కాలు జారి కిందపడ్డాడు” అని దానికి క్యాప్షన్ పెట్టారు. ఇటువంటి అరుదైన ఘటనల గురించి తెలుసుకోవాలనే ప్రజల కుతూహలానికి ఈ వీడియోను వచ్చిన స్పందనే నిదర్శనం. దీన్ని చూసిన నెటిజన్స్ తీరొక్క కామెంట్స్ చేశారు. వ్యోమగామి చంద్రుడి పై కాలు జారి పడిన భంగిమ ను మైఖేల్ జాక్సన్ డ్యాన్స్ ఫీట్ తో పోల్చారు. మైఖేల్ జాక్సన్ మూన్ వాక్ గురించి తెలుసుకోకుండా మూన్ పైకి వెళితే ఇలాగే ఉంటుందని కామెంట్స్ చేశారు.