Site icon HashtagU Telugu

Delhi Blast: ఢిల్లీలో ఇజ్రాయెల్ ఎంబసీ సమీపంలో బాంబ్ పేలుడు

Delhi Blast

Delhi Blast

Delhi Blast: న్యూఢిల్లీలో ఉన్న ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో మంగళవారం సాయంత్రం బాంబ్ పేలుడు సంభవించినట్లు ఢిల్లీ పోలీసులకు కాల్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సాయంత్రం 5.47 గంటలకు కాల్ వచ్చిందని, ఢిల్లీ పోలీసుల పీసీఆర్ నుంచి కాల్ వచ్చింది. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రెండేల్ల క్రితం జనవరి 29, 2021 సాయంత్రం న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ ఎంబసీ సమీపంలో బాంబ్ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి చాలా కార్లు దెబ్బతిన్నాయి. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

Also Read: Cabbage Chutney: ఎంతో రుచికరమైన క్యాబేజీ పచ్చడి.. తయారీ చేసుకోండిలా?