Bomb Blast : పేలుడు ఎవ‌రిప‌నో తెలుసుకుంటున్నాం- ఎస్పీ

పంజాబ్ లోని లూథియానా కోర్టులో హై గ్రేడ్ పేలుడు సంభ‌వించింది. ఆ పేలుడుకు ఒక‌రు మ‌ర‌ణించ‌గా, ముగ్గురు గాయ‌ప‌డ్డారు. సెషన్స్ కోర్టు కాంప్లెక్స్‌లోని వాష్‌రూమ్‌లో గురువారం ఈ సంఘ‌ట‌న జ‌రిగింది.

  • Written By:
  • Updated On - December 23, 2021 / 04:49 PM IST

పంజాబ్ లోని లూథియానా కోర్టులో హై గ్రేడ్ పేలుడు సంభ‌వించింది. ఆ పేలుడుకు ఒక‌రు మ‌ర‌ణించ‌గా, ముగ్గురు గాయ‌ప‌డ్డారు. సెషన్స్ కోర్టు కాంప్లెక్స్‌లోని వాష్‌రూమ్‌లో గురువారం ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. నేష‌న‌ల్ ఇన్వెస్టిగేష‌న్ ఏజెన్సీ కి చెందిన రెండు బృందాలు చండీగ‌ఢ్, ఢిల్లీ నుంచి వేర్వేరుగా సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశాయి. భద్రతా వర్గాల సమాచారం ప్రకారం, ఇది “ఆత్మహత్య బాంబు దాడి” గా అనునిస్తున్నాయి. బాంబు పేలుడు స్వభావం ఆధారంగా బాంబుగా అనుమానిస్తున్నారు.

 

 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆరు అంతస్థుల కోర్టు కాంప్లెక్స్‌లోని రెండో అంతస్తులో మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించగా, చుట్టుపక్కల వారు గాయపడ్డారు. పేలుడు కారణంగా వాష్‌రూమ్‌లోని రెండు గోడలు కూలిపోయి ఒక కిటికీ పగిలిపోయాయి. పేలుడు పదార్థం ఎలాంటిదనే విషయంపై పోలీసులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు.

 

ఘటనా స్థలానికి ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించారు. పేలుడు పదార్థాల నిపుణులు కూడా ఘటనా స్థలంలో ఉన్నారు’’ అని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి తెలిపారు.
పేలుడు పదార్థాన్ని పురుషుల టాయిలెట్‌లో ఉంచారు. పేలుడు టైంలో చుట్టూ నలుగురైదుగురు మాత్రమే ఉన్నారు. ఒకరు మరణించగా, ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. కోర్టు వద్ద భద్రతను పెంచారు. కోర్టు కాంప్లెక్స్‌లోని సీసీటీవీ ఫుటేజీతోపాటు ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలను పరిశీలిస్తున్నారు.