ఏలూరు అరిగిపల్లి మండలం తాడేపల్లి గ్రామంలో హ్యాపీ వాల్యూ స్కూల్లో ప్లాస్టిక్‌వ్యర్ధాలను సేకరిస్తుండగా పేలుడు (blast) సంభవించింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో నలుగురు వ్యక్తులు ఉన్నారని, ఇద్దరు తప్పించుకోగా మరో ఇద్దరికి గాయాలయ్యాయని నూజివీడు డీఎస్పీ చెప్పారు. గాయాలైనవారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారని తెలిపారు.
చెత్త దగ్గర భయంకర శబ్దంతో పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చెత్తకు నిప్పంటించగా కెమికల్ తో కూడిన వ్యర్థపదార్థాలు ఉన్నట్లు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. పేలుడు (blast)కు సంబంధించిన కారణాలను అన్వేషిస్తున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. ఈ పేలుడుపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Also Read: Macherla TDP : మాచర్ల ఘటనపై డీజీపీ విచారణకు ఆదేశం