Site icon HashtagU Telugu

Blast in Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ పేలుడు.. 5 మంది మృతి..?

China Explosion

Bomb blast

ఆఫ్ఘనిస్థాన్‌లో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు మరణించారు. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మజార్ ఏ షరీఫ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురౌతున్నారు. గత కొన్ని రోజులుగా అక్కడ వరుసగా బాంబు దాడులు జరుగుతూనే ఉన్నాయి.

ఆఫ్ఘనిస్థాన్‌లోని బాల్ఖ్ ప్రావిన్స్‌లో మంగళవారం పేలుడు సంభవించినట్లు స్థానిక మీడియా తెలిపింది. మజార్-షరీఫ్ నగరంలోని మూడవ జిల్లాలోని సయ్యద్ అబాద్ కూడలిలో పేలుడు సంభవించిందని TOLO news నివేదించింది. ఆఫ్ఘన్ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం భద్రతా బలగాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఆయిల్ కంపెనీకి చెందిన ఉద్యోగులు ప్రయాణిస్తున్న వాహనంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కనీసం 5 మంది మరణించినట్లు సమాచారం.

బాల్ఖ్ ప్రావిన్స్‌లోని బస్సులో మంగళవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందని ఉత్తర ఆఫ్ఘనిస్థాన్‌లోని బల్ఖ్ ప్రావిన్స్ పోలీసు ప్రతినిధి మహ్మద్ ఆసిఫ్ వజేరి తెలిపారు. ఈ వాహనం హెర్టెన్ ఆయిల్ కంపెనీ ఉద్యోగులది. పేలుడు వెనుక ఎవరున్నారో ఇప్పటి వరకు స్పష్టంగా తెలియరాలేదని ఆసిఫ్ అన్నారు. ఇటీవలి నెలల్లో ఆఫ్ఘనిస్తాన్‌లో అనేక దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.