Odisha Blast; ఒడిశాలో రైలు ప్రమాదం ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు మంగళవారం దెంకనల్ జిల్లాలోని మేరమండలి వద్ద ఉన్న టాటా స్టీల్ ప్లాంట్ లో ఉన్న బ్లాస్ట్ ఫర్నేస్ ఆవిరి లైన్ పేలింది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఇందులో 19 మంది కార్మికులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. తీవ్రంగా గాయపడిన కార్మికులనీ కటక్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుంది. దెంకనల్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ తెలిపిన వివరాల ప్రకారం ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
ఓడపాడ బ్లాక్‌లోని నరేంద్రపూర్‌లోని టాటా స్టీల్ మేరమండలి కంపెనీలో స్టీమ్ లైన్ పేలుడులో 19 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బీఎఫ్ పవర్ ప్లాంట్-2 పక్కనే ఉన్న స్టీమ్ లైన్ దగ్గర కూలీలు పని చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. అయితే ఈ ప్రమాదంపై సదరు సంస్థ స్పందించింది. ఈ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు కంపెనీ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని కంపెనీ తెలిపింది.
Read More: Amit Shah Politics: బీజేపీ ఆకర్ష్.. రాజమౌళి, ప్రభాస్ తో అమిత్ షా భేటీ!