Site icon HashtagU Telugu

BJYM : బీజేవైఎం కార్య‌క‌ర్త‌ల‌కు బెయిల్ మంజూరు.. టీఎస్పీఎస్సీ పేప‌ర్ లీకేజీ నిర‌స‌న‌లో అరెస్ట్‌

Karnataka Bjp

Bjp

టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలకు బెయిల్ మంజూరైంది. పరీక్ష పేపర్ లీక్ స్కామ్ నేపథ్యంలో నాంపల్లిలోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళ‌న‌లో 10 మంది భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరికి స్థానిక కోర్టు మంగళవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. బేగంబజార్ పోలీసులు వారం రోజుల క్రితం బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్‌తో సహా కార్యకర్తలపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వారిని జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. మంగళవారం బీజేవైఎం కార్యకర్తల తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించి బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బీజేవైఎం కార్యకర్తలకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.