Site icon HashtagU Telugu

TRS vs BJP : వ‌రంగ‌ల్‌లో టీఆర్ఎస్ బీజేపీ కార్య‌క‌ర్త‌ల బావాబాహీ

Trs Bjp

Trs Bjp

వ‌రంగల్‌లోని జఫర్‌గఢ్ మండలం కూనూరులో ప్రజాసంగ్రామ యాత్రలో బీజేపీ, టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ర్యాలీని అడ్డుకునేందుకు టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారని బీజేపీ ఆరోపించింది. ఇరువ‌ర్గాలు నినాదాలు చేసుకుంటూ తోపులాట జ‌రిగింది. కార్య‌క‌ర్త‌ల‌ను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. లాఠీచార్జిలో పలువురు గాయపడ్డారని, పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పోలీస్ వ్య‌వ‌స్థ‌ను దుర్వినియోగం చేస్తున్నారని బీజేపీ నేత‌లు మండిప‌డ్డారు. పాదయాత్రను తక్షణమే నిలిపివేయాలని బీజేపీని ఆదేశిస్తూ పోలీసుల ఆదేశాలను సింగిల్ జడ్జి ధర్మాసనం గురువారం సస్పెండ్ చేసింది. సింగిల్ జడ్జి తీర్పుపై ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. పాదయాత్ర కొనసాగించడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ అప్పీల్‌ను వెంటనే విచారించాలని కోరింది. కాగా మూడు రోజుల విరామం తర్వాత స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో సంజయ్‌ పాదయాత్రను పునఃప్రారంభించారు. ఆయన వెంట పెద్ద సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, మద్దతుదారులు ఉన్నారు.

Exit mobile version