Site icon HashtagU Telugu

GHMC: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ భేటీలో ‘బీజేపీ, టీఆర్ఎస్’ లొల్లి!

Gjmc1

Gjmc1

GHMC సమావేశం రసాభాసగా సాగింది. జీహెచ్ఎంసీ బడ్జెట్ ను ప్రవేశపెట్టే సందర్భంగా మేయర్ విజయలక్ష్మీ ఆధ్వర్యంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో టీఆరెస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య బాహాబాహీకి కారణం అయ్యింది. గోధుమలకు, వరికి తేడా తెలియని…నేతలంటూ టీఆరెస్ కార్పొరేటర్ కవిత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. కవిత వ్యాఖ్యలపై బీజేపీ కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ కార్పొరేటర్లు మేయర్ పోడియం దగ్గరకు వెళ్లి నిరసన తెలిపారు. దీంతో టీఆరెస్ కార్పొరేటర్లు కూడా మేయర్ పోడియం వద్ద నిరసనలు చేశారు. ఈ క్రమంలో రెండు పార్టీల కార్పొరేటర్ల మధ్య బాహాబాహీ దాకా వెళ్లడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మేయర్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆందోళనను విరమించాలని ఇరు పార్టీల నేతలకు చెప్పారు. టీఆరెస్ కార్పొరేటర్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తామని.. బీజేపీ నేతలకు మేయర్ హామీ ఇచ్చారు. దీంతో ఇరు వర్గాల నేతలు శాంతించారు. కాగా మేయర్ విజయలక్ష్మీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టి ఆమోదించాల్సిందిగా సభను కోరారు. 2022-23కు సంబంధించిన రూ. 6,150కోట్లతో బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు మేయర్ చెప్పారు. స్కైవేలు, రోడ్ల అభివ్రుద్ధి , ఫ్లైఓవర్స్ కోసం రూ. 15వందల కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

Exit mobile version